TTD TO RELEASE SED AND SSD IN ON-LINE ONLY _ సెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల

8000 TICKETS OF SED AND 8000 TOKENS OF SSD EVERY DAY

 

  • NO MORE OFFLINE ISSUE OF SSD TOKENS IN TIRUPATI FROM SEPTEMBER 26 ONWARDS

 

 * DECISION IN VIEW OF HEALTH SECURITY OF LOCALS AND DEVOTEES- TTD CHAIRMAN SRI YV SUBBA REDDY 

 

Tirumala, 22 Sep. 21:  TTD Chairman Sri YV Subba Reddy has said 8000 numbers of online Quota of Special Entry Darshan tickets will be released at 9am on September 24.

 

In a statement released on Wednesday, he said an equal number of 8000 Slotted Sarva Darshan (SSD) tokens will be released in on-line for the period from September 26 to October 31 on September 25 at 9am.

 

He said TTD will stop the issuance of off-line SSD tokens in Tirupati from September 26 onwards.

 

The TTD Chairman said the above decision has been made in view of the health security of local devotees as well from other regions in view of the Covid Pandemic.

 

As the overcrowding at SSD token issue centres earlier had allegedly become a source of the spread of pandemic Covid during the Second wave, TTD has taken this decision.

 

He also appealed that devotees coming with on-line Special entry tickets or SSD tokens should posses either 2-dose vaccination certificates or should come with Covid Negative test report which they have taken three days before reporting on the day of their darshan.

 

He urged all devotees to note the Covid guidelines and strictly observe for their personal benefit as well others and co-operate with TTD.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల

– దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి – టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి

తిరుమల 22 సెప్టెంబర్ 20 21: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెప్టెంబరు 26 వ తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని ఆయన తెలిపారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందువల్ల

ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చైర్మన్ వివరించారు. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

అక్టోబరు నెలకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని చైర్మన్ తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది