AP CM TO INAUGURATE GO MANDIRAM DURING BRAHMOTSAVAMS- TTD EO _ బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా గోమందిరం ప్రారంభానికి ఏర్పాట్లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirupati, 22 September 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy had said the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will inaugurate the Go Mandiram during the ensuing Brahmotsavams next month.

 

The TTD EO inspected the progress of activities at the Go-Mandiram, Paediatric Hospital at BIRRD complex and Panchagavya products production at the DPW stores complex on Wednesday evening.

 

Speaking on the occasion the TTD EO said the Go Mandiram is under progress near Alipiri Padala Mandapam with donations of ₹15 crore by a devotee of Sri Venkateswara Swamy Sri Sekhar Reddy.

 

“The arrangements are underway at the Go-Mandiram for devotees to perform Go Pradakshina, Go Tulabharam and the significance of Go puja is also being highlighted here”, he added.

 

The EO said all civil works for the Paediatric hospital at the BIRRD  hospital complex are completed and notifications have also been issued for the procurement of medical equipment and recruitment of doctors. “All out efforts are also being made for the inauguration of the hospital during the annual Srivari Brahmotsavams”, he said.

 

Later he also visited the DPW stores at Tirupati where Panchagavya products are being manufactured and issued valuable directions to the engineering staff.

 

Additional EO Sri AV Dharma Reddy, CE Sri Nageswara Rao, BIRRD CS and RMO Sri Shailendra, OSD Dr Reddappa Reddy, CMO Dr Muralidhar, Goshala Director Dr Harnath Reddy, SEs Sri Jagadeeshwar Reddy,Sri Venkteswarulu and VGO Sri Manohar were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా గోమందిరం ప్రారంభానికి ఏర్పాట్లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి, 2021 సెప్టెంబరు 22: తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద దాత శ్రీ శేఖ‌ర్‌రెడ్డి రూ.15 కోట్ల విరాళంతో నిర్మిస్తున్న గోమందిరాన్ని శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని గోమందిరం, పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి, డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ కేంద్రంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను బుధ‌వారం ఈవో ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ గోమందిరంలో గోప్ర‌ద‌క్షిణ‌, గోతులాభారం, గోవు ప్రాశ‌స్త్యాన్ని భ‌క్తుల‌కు తెలియ‌జేసేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. బ‌ర్డ్ ఆసుప‌త్రి ఆవ‌ర‌ణంలో పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి నిర్మాణానికి సంబంధించిన సివిల్ ప‌నులు పూర్త‌య్యాయ‌ని, వైద్య ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుకుని, వైద్యుల నియామ‌కం కోసం నోటిఫికేష‌న్ జారీ చేశామ‌ని చెప్పారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఈ ఆసుప‌త్రిని ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. అదేవిధంగా, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీకి తిరుప‌తిలోని డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌లో ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈవో వెంట టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, బ‌ర్డ్ సిఎస్ ఆర్ఎంవో శ్రీ శేష‌శైలేంద్ర‌, ప్ర‌త్యేకాధికారి డాక్ట‌ర్ రెడ్డెప్ప‌రెడ్డి, సిఎంవో డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రినాథ‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, విజివో శ్రీ మ‌నోహ‌ర్ ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.