TTD TO SIGN MoU ON “DRY FLOWER TECHNOLOGY” ON SEP.13 _ సెప్టెంబ‌రు 13న ఉద్యాన విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు – టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

TIRUPATI, 03 SEPTEMBER 2021:  Continuing its eco-friendly efforts, TTD is all set to sign MoU with YSR Horticulture University on September 13 for making use of Dry Flower Technology to produce decorative products and ornamental materials required for its needs out of the used flowers from TTD temples.

 A meeting was held on the same by TTD EO Dr KS Jawahar Reddy on Friday at his chambers in the TTD Administrative Building in Tirupati along with JEO Smt Sada Bhargavi and VC of Dr YSR Horticultural University, West Godavari Dr Janakiram. The EO said, “Dry Flower Technology is a globally accepted natural, eco-friendly, long-lasting and inexpensive technology which is very much needed at the present scenario in which the entire world is sailing. This technology is used in designing bouquets, paperweights, laminated photos of deities, room freshners, key chains etc. 

 “The Horticultural University will give training to women in the Citrus Research Station located in Tirupati. Later they will use the technology to dry flowers and design the photos of Swamivaru and Ammavaru with those dried flowers. The necessary equipment, training, and infrastructure required for this technology will be provided by TTD at Rs.83lakhs. These photos will be made available for pilgrims in all the TTD sales counters located at Tirumala in two or three months”, EO added.   

FACAO Sri Balaji, DLO Sri Reddeppa Reddy, DyEO Sri Ramanaprasad, YSR Horticulture University Registrar Dr K Gopal, Director of Extension Dr B Srinivasulu, Principal Scientist Dr R Nagaraju were also present. 

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 13న ఉద్యాన విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు – టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి, 2021 సెప్టెంబ‌రు 03: టిటిడిలోని వివిధ ఆలయాల్లో ఉప‌యోగించిన పూల‌తో స్వామి, అమ్మ‌వార్ల ఫోటోలు, క్యాలండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు తదితరాలు త‌యారు చేయ‌డానికి డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యంతో సెప్టెంబ‌రు 13వ తేదీ ఎంఓయు కుదుర్చుకుంటామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు. తిరుప‌తి శ్రీ‌ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో శుక్ర‌వారం సాయంత్రం డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి డాక్ట‌ర్ టి.జాన‌కిరామ్‌తో పాటు సంబంధిత అధికారుల‌తో ఈవో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ఉప‌యోగించి ఫోటోలు, త‌దిత‌రాలు త‌యారు చేయించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ఇందుకోసం తిరుప‌తిలోని ఆ విశ్వ‌విద్యాల‌యంకు చెందిన సిట్రాస్ రిసెర్చ్ స్టేష‌న్‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రూ.83 ల‌క్ష‌ల‌తో ప‌రిక‌రాలు, శిక్ష‌ణ‌కు నిధులు టిటిడి స‌మ‌కురుస్తుంద‌ని దీనికి బ‌దులుగా స్వామివారి ఫోటోలతో పాటు కీ చైన్లు, పేప‌ర్ వెయిట్లు, రాఖీలు, క్యాలండ‌ర్లు, డ్రై ఫ్ల‌వ‌ర్ మాల‌లు త‌దిత‌రాలు త‌యారు చేసి టిటిడికి ఇస్తార‌ని చెప్పారు. వీటిని భ‌క్తుల‌కు విక్ర‌యించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, డిఎల్‌వో శ్రీ రెడ్డెప్ప రెడ్డి, యూనివ‌ర్శిటి డైరెక్ట‌ర్ ఆఫ్ ఎక్స్‌టెన్ష‌న్ డా.బి.శ్రీ‌నివాసులు, రిజిష్టార్ శ్రీ కె.గోపాల్, ప్రిన్సిప‌ల్ సైటిస్ట్ ఆర్‌. నాగ‌రాజు, డెప్యూటీ ఈవో శ్రీ ర‌మ‌ణ‌ప్ర‌సాద్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.