TTD CHAIRMAN MEETS K’TAKA CM AND EX-CM _ కర్నాటక సిఎం, మాజీ సిఎం లను కలిసిన టీటీడీ చైర్మన్
TIRUMALA, 03 SEPTEMBER 2021: TTD Chairman Sri YV Subba Reddy has met the Honourable CM of Karanataka Sri Basavaraj Bommai and former CM Sri BS Yediyurappa at Bengaluru on Friday. The TTD Board Chief has presented Theertha Prasadams to the two dignitaries. Later the Chairman also offered prayers in the Sri Rama temple located at Doddenakundi in Karnataka. Kavali legislator Sri Ramireddi Pratap Kumar Reddy, ex-MLA Sri Nandeesh Reddy also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కర్నాటక సిఎం, మాజీ సిఎం లను కలిసిన టీటీడీ చైర్మన్
తిరుమల 3 సెప్టెంబరు 2021: టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం బెంగుళూరులో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి శ్రీ యడ్యూరప్పను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్థ, ప్రసాదాలను అందించి శాలువతో సత్కరించారు.
సిఎం, మాజీ సిఎం టీటీడీ చైర్మన్ ను శాలువతో సన్మానించారు.
అనంతరం శ్రీ వైవి సుబ్బారెడ్డి దొడ్డేన కుండి లోని శ్రీ కోదండ రామ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయబద్దంగా ఆయనకు స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీ నందీష్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది