TULASI VIVAHAM FOR LOKA KALYANAM-KANCHIKAMAKOTI PEETHADHIPATI _ లోక‌క‌ల్యాణం కోసం తుల‌సి వివాహం: కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి

SRI TULASI DHAATRI SAHITA DAMODARA PUJA PERFORMED IN VASANTHA MANDAPAM

 Tirumala, 26 Nov. 20: Advocating that the Tulasi Vivaham is observed for the well being of all the living beings in the universe, said Sri Sri Sri Vijayendra Saraswathi Swamy of Kanchikamakoti Peetham.

The pontiff who graced the celestial fete, that was conducted at Vasantha Mandapam on Thursday, said, Tulasi Vivaham occupies an important place in the Hindu Sanatana Dharma. In the life cycle of a human being, the marital phase has a significant role to play. Tulsi has got both the spiritual and medicinal values in it. Hence, Tulasi- the holy basil is considered most sacred and a pious plant in every Hindu household. The women offer regular pujas to the Tulasi plant with utmost reverence seeking prosperity and longevity of their husband’s life”, he added.

Later he appreciated the Karthika Masa Deeksha programme mulled by TTD authorities in Vasantha Mandapam and said these activities will glorify Hindu Sanatana Dharma. 

Earlier, he participated in Sri Tulasi Dhaatri Sahita Damodara Archanam, Kalyanam and Puja programmes. The murthies of lord and goddesses were brought to Vasanta Mandapam and Agama Advisor Sri Mohana Rangacharyulu explained the importance of the day programme. Later celestial Kalyanam has been performed to Tulasi and Amla plant. The replica of Goddess Tulasi stood as special attraction.

Additional EO Sri AV Dharma Reddy, Agama Advisor Sri Sundaravaradan, Chief Priest Sri Venugopala Deekshitulu and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

లోక‌క‌ల్యాణం కోసం తుల‌సి వివాహం : కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి

వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా శ్రీ తులసి ధాత్రి స‌హిత దామోద‌ర పూజ‌

తిరుమల‌, 2020 నవంబరు 26: విశ్వంలోని స‌క‌ల‌జీవులు సుభిక్షంగా ఉండాల‌ని, లోక‌క‌ల్యాణం కోసం తుల‌సి వివాహం కార్య‌క్ర‌మాన్ని టిటిడి చేప‌ట్టింద‌ని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి ఉద్ఘాటించారు. కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా గురు‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ తులసి ధాత్రి స‌హిత దామోద‌ర పూజ‌ ఘనంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఈ పూజ‌లో పాల్గొన్న శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ స‌నాత‌న ధ‌ర్మంలో తుల‌సి వివాహానికి విశేష ప్రాధాన్యం ఉంద‌న్నారు. జీవిత‌చ‌క్రంలో వివాహం ముఖ్య‌మైన ఘ‌ట్ట‌మ‌న్నారు. తుల‌సి భ‌క్తికి, ఆరోగ్యానికి ప్ర‌తీక అన్నారు. ప్ర‌తి ఇంట్లో తుల‌సి మొక్క ఉంటుంద‌ని, మ‌హిళ‌లు త‌మ సౌభాగ్యం కోసం తుల‌సికి పూజ‌లు చేస్తార‌ని చెప్పారు. స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో టిటిడి చేప‌ట్టిన కార్తీక దీక్ష కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు.  

అంత‌కుముందు ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీ తుల‌సీ ధాత్రి స‌హిత దామోద‌ర పూజ విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. అనంత‌రం కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, తుల‌సి,  ధాత్రి(ఉసిరి) క‌ల్యాణం, శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి తిరువారాధ‌న చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

అదేవిధంగా, రాత్రి … 7.15 నుంచి 7.45 గంటల వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై  డా.మారుతి ‘కార్తీక పురాణం – విష్ణువైభవం’ పారాయణం చేయనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ద‌నాచార్యులు‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.