TWO BIN SYSTEM FOR WASTE DISPOSAL IS MUST FOR ALL HOTELS IN TIRUMALA _ తిరుమలలోని అన్ని హోటళ్లలో వ్యర్థాలను పారవేసేందుకు రెండు బిన్ల వ్యవస్థ తప్పనిసరి
ALL EATERIES SHOULD SET UP COMPLAINT/SUGGESTION BOX – TTD EO
Tirumala, 30 July 2024: With an intention to provide a hygienic environment and qualitative food to the scores of pilgrims visiting Tirumala, TTD EO Sri J Syamala Rao has instructed that all eateries including big and small hotels should maintain Two garbage system for waste disposal and set up a Compliant/Suggestion box to get the feedback from the devotees.
A review meeting on the Big and Janata Canteens, APTDC hotels was held at the meeting hall of Sri Padmavathi Rest House in Tirupati on Monday where in the Additional EO Sri Ch Venkaiah Chowdhary, JEOs Smt Goutami, Sri Veerabrahmam were also present.
The EO instructed that all the Hotels in Tirumala should collect garbage as Wet Waste and Dry Waste and dispose them quite often for maintaining a hygienic environment in their hotel premises. The Hotels have to display the following guidelines along with the rates of each recipe on the display boards viz. No synthetic colours/banned colours are used in the food items, Tasting salt shall not be recommended for the people below 12 years, Hotel is not given for any sub-lease.
Instructing further he said, the big and Janata Canteens have to display the names of their Hotels inevitably. The hotels have to submit the revised rates to the Revenue section of TTD. “For all canteens in Tirumala, the Food Safety Department will give FoSTaC training after August 5. After that the canteens and eateries will be inspected. Even the water bottles should not be sold for more than Rs.20. During the inspection if anyone is found violating the prescribed guidelines, stern action will be taken against those who are found guilty”, he asserted.
Later the activities and issues related to the Annaprasadam, Donor Cell and Health departments have also been reviewed.
Among others, Annaprasadam DyEO Sri Rajendra Kumar, Catering Special Officer Sri Shastry, DyEO Donor Cell Sri Selvam, DyEO Health Smt Asha Jyothi, Additional HO Dr Sunil Kumar and others were also present.
తిరుమలలోని అన్ని హోటళ్లలో వ్యర్థాలను పారవేసేందుకు రెండు బిన్ల వ్యవస్థ తప్పనిసరి
• హోటళ్లలో తినుబండారాలపై ఫిర్యాదులు/సూచనల పెట్టెను ఏర్పాటు చేయాలి – టీటీడీ ఈవో
తిరుమల, 2024 జూలై 30: తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో పెద్ద, చిన్న హోటళ్లతో సహా అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాలలో వ్యర్థాలను తొలగించేందుకు రెండు చెత్త బిన్ల వ్యవస్థను నిర్వహించాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల నుండి అభిప్రాయాన్ని పొందడానికి ఫిర్యాదులు/సూచనల పెట్టెను ఏర్పాటు చేయాలన్నారు.
తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో పెద్ద, జనతా క్యాంటీన్లు, ఏపీటీడీసీ హోటళ్లపై సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలోని అన్ని హోటళ్లలో చెత్తను తడిచెత్త, పొడి చెత్తగా సేకరించాలన్నారు. తమ హోటల్ ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. హోటళ్ళు ఆహార పదార్థాల ధరలతో ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు క్రింది మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఆహార పదార్ధాలలో సింథటిక్ రంగులు/నిషేధించబడిన రంగులు ఉపయోగించలేదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు టేస్ట్ ఎంహేన్సర్ తో చేసిన పదార్థాలు తినరాదు. హోటల్ లైసెన్స్ పొందిన వారు వాటిని ఎటువంటి సబ్ లీజుకు ఇవ్వలేదు.
అదేవిధంగా పెద్ద మరియు జనతా క్యాంటీన్లు తప్పనిసరిగా తమ హోటళ్ల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించారు. సవరించిన ధరలను రెవెన్యూ విభాగానికి సమర్పించాలన్నారు.
‘‘తిరుమలలోని అన్ని క్యాంటీన్‌ల వారికి ఆగస్టు 5 తర్వాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ శిక్షణ ఇస్తుందని, ఆ తర్వాత క్యాంటీన్లు, తినుబండారాలను తనిఖీ చేస్తామని తెలియజేశారు. వాటర్ బాటిళ్లు కూడా రూ.20కి మించి అమ్మకూడదని, తనిఖీ సమయంలో నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం అన్నప్రసాదం, దాతల విభాగం, ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, సమస్యలను కూడా ఈవో సమీక్షించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర కుమార్, శ్రీ సెల్వం, శ్రీమతి ఆశాజ్యోతి,
అదనపు ఆరోగ్యశాఖ అధికారి డా. సునీల్ కుమార్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.