ADI KRITTIKA HELD IN SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా ఆడికృత్తిక
Tirupati, 30 July 2024: The festival of Adi Krittika was celebrated at Tirupati Sri Kapileswara Swamy Temple on Tuesday.
On this occasion, in the morning the Utsava Murthies of Sri Valli Devasena along with Sri Subramanyeshwara Swamy were rendered Snapana Tirumanjanam
In the evening, Tiruveedhi Utsavam will be held.
Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Krishna Verma, Temple Inspector Sri Balakrishna and temple priests participated in this program.
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా ఆడికృత్తిక
తిరుపతి, 2024 జూలై 30: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ కృష్ణ వర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.