ANNUAL BRAHMOTSAVAMS OF UPAMAKA SRI SVT_ సెప్టెంబరు 29 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 25 Sep. 19: TTD is organising annual Brahmotsavams at TTD sub temple of Sri Venkateswara Swamy Temple at Upamaka, Nakkalapalli mandal Of Visakhapatnam District from September 29 to October 8 and Ankurarpanam on September 29 at 9.52 am.

Prominent events were Hanumanta vahanam on October 1, Hamsa vahanam on October 2, Sesha Talpa vahanam on October 4, Garuda vahanam on October 5, Rathotsavam on October 6,

The artists of TTDs HDPP and Annamacharya Project will organise harikatha, Bhakti sangeet etc. on all days of Brahmotsavams.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 29 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2019 సెప్టెంబరు 25: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం, ఉపమాకలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 29 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 29న ఉదయం 9.52 గంటలకు తిరువీధిలో బ్రహ్మోత్సవ కావ‌డి ఊరేగింపుతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. ఆ త‌రువాత చిన్నపల్లకీ ఉత్సవం, అశ్వ వాహ‌న‌సేవ‌ నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

30-09-2019 పెద్ద పల్లకీ ఉత్సవం రాజధిరాజ

01-10-2019 హనుమంత వాహనం ఇత్తడి సప్పరం

02-10-2019 శేష‌త‌ల్ప వాహ‌నం హంస వాహనం

03-10-2019 రాజధిరాజ పెద్ద పల్లకీ

04-10-2019 పెద్ద‌ప‌ల్ల‌కీ ఉత్స‌వం శేష‌త‌ల్ప వాహ‌నం

05-10-2019 ———– వసంతోత్సవం – ఇత్త‌డి గ‌రుడ‌వాహనం

06-10-2019 ———- పుణ్యకోటి – రథోత్సవం

07-10-2019 ————– గజవాహనం – మృగవేట

08-10-2019 పల్లకీ (వినోదోత్సవం) విజ‌య‌ద‌శ‌మి(పుణ్య‌కోటి వాహ‌నం)

సెప్టెంబరు 29 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వరకు శ్రీ చక్ర పెరుమాళ్‌ను చిన్న పల్లకీపై తిరువీధి ఉత్సవం నిర్వ‌హిస్తారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.