SO REVIEWS ON GARUDA SEVA ARRANGEMENTS_ అక్టోబరు 4న గరుడసేవకు ప్రత్యేక ఏర్పాట్లు – తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి. ధ‌ర్మారెడ్డి

Tirumala, 25 Sep. 19: The Special Officer Sri AV Dharma Reddy, reviewed on the arrangements for Garuda Seva during the upcoming annual brahmotsavams in Tirumala along with other officials on Wednesday.

He discussed in detail about the galleries meant for protocol, VIP, Employees, Police, Media etc. and the past year experiences by means of power point presentation at Gokulam Conference Hall.

Later he inspected the VIP Big badge and Small badge entry points at Rambhageecha, galleries at Vahana Mandapam along with vigilance and engineering officials.

Additional CVSO Sri TV Siva Kumar Reddy, VGO Sri Manohar, Temple DyEO Sri Harindranath, GMs Sri Sesha Reddy, Sri Jagadishwar Reddy, EEs Sri Subramanyam, Sri Mallikarujuna Prasad, Sri Chandrasekhar and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు 4న గరుడసేవకు ప్రత్యేక ఏర్పాట్లు – తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి. ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2019 సెప్టెంబ‌రు 24: సెప్టెంబ‌రు 30వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా అక్టోబ‌రు 4న జ‌రుగ‌నున్న శ్రీ‌వారి గ‌రుడ సేవ‌కు ల‌క్ష‌లాదిగా విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప‌గ‌డ్బందిగా ఏర్పాట్లు చేయాల‌ని తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మ‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లోని గోకులం స‌మావేశ మందిరంలో బుధ‌వారం ఉద‌యం ప్ర‌త్యేకాధికారి గరుడ సేవ‌ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు విచ్చేసే ప్రోటోకాల్ ప్ర‌ముఖులు, విఐపిలు, ఉద్యోగులు, పోలీస్, మీడియా మొదలైన వాటి కోసం ఉద్దేశించిన గ్యాలరీలు, గత సంవత్సరం అనుభవాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరంగా చర్చించారు.

అనంత‌రం ప్ర‌త్యేకాధికారి రాంభగీచ వద్ద విఐపిలు ప్ర‌వేశించే మార్గాల‌ను, వాహ‌న‌ మండపం, గ్యాలరీల‌ను విజిలెన్స్ మరియు ఇంజనీరింగ్ అధికారులతో క‌లిసి పరిశీలించారు.

ఈ స‌మావేశంలో అదనపు సివిఎస్వో శ్రీ శివ కుమార్ రెడ్డి, విజిఓ శ్రీ మనోహర్, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, జిఎంలు శ్రీ శేషా రెడ్డి, శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇఇలు శ్రీ సుబ్రమణ్యం, శ్రీ మల్లికార్జ‌న ప్రసాద్, శ్రీ చంద్రశేఖర్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.