VAHANA SEVAS CULMINATES WITH ASWA _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి 

TIRUPATI, 17 JUNE 2022: All the Vahana Sevas during the ongoing annual Brahmotsavams in Appalayagunta concluded with Aswa Vahanam on Friday evening on the eighth day.

The annual fete will come to a grand conclusion on June 18 with Chakra Snanam in the morning and Dhwajavarohanam in the night.

Temple DyEO Sri Lokanatham, EE Sri Narasimha Murty, Superintendent Smt Srivani, devotees and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2022 జూన్ 17: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్ర‌వారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఇఇ శ్రీ నరసింహ మూర్తి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి శ్రీ‌వాణి, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.