SUNDARA RAJA SWAMY UTSAVAMS _ జూన్ 20 నుండి 22వ తేదీ వరకు శ్రీసుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు 

TIRUPATI, 17 JUNE 2022: The annual Avatara Utsavams of Sri Sundararaja Swamy teme in Tiruchanoor will be observed from June 20 to 22.

Every day there will be Snapana Tirumanjanam in Sri Krishna Mukha Mandapam between 2pm and 3:30pm to Sri Sridevi Bhudevi sameta Sundararaja Swamy. In the evening Unjal Seva will be observed here.

On first day Pedda Sesha, second-day Hanumantha and on the last day Sri Sundararaja will take ride on Garuda vahanams to bless His devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 20 నుండి 22వ తేదీ వరకు శ్రీసుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

తిరుపతి, 2022 జూన్ 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు జూన్ 20 నుండి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం శ్రీ సుందరరాజస్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చ‌న నిర్వహిస్తారు.

జూన్ 20, 21, 22వ తేదీలలో మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపములో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ జరుగుతుంది.

జూన్ 20వ తేదీ రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీసుందరరాజస్వామివారు పెద్దశేష వాహనం, 21వ తేదీ రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనం, 22వ తేదీ రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు గరుడ వాహనంపైన, ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా జూన్ 20 నుండి 22వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఊంజ‌ల‌సేవను రద్దు చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.