VAIKUNTA DWARA DARSHAN AT SRI KVST_ వైకుంఠ ఏకాదశికి భక్త కోటితో టిటిడి స్థానిక ఆలయాలు శ్రీనివాసమంగాపురంలో వైకుంఠద్వార దర్శనంతో పులకించిన భక్తులు

Tirupati, 18 Dec. 18: All local sub-temples of TTD were brimming with non-stop flow of devotees on the occasion of Vaikunta Ekadasi.

At the Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram the Vaikunta Dwara Darshan commenced from 3am after Thiruppavai, Tomala Koluvu and other sevas during early hours on Tuesday.

TTD had fully organised floral and electrical decorations besides Anna prasadam, drinking water, queue lines, security and cultural programs.

The programs of Mangaladhwani, Veda parayanam, Vishnu Sahasranamam were rendered by students of SV music and Dance College and SV Higher Vedic institution. Later artists of HDPP presented bhaktisangeet. In the evening Bhakti sangeet and harikathas will be performed.

On December 19 also the celestial event of Sri Sudarshan Chakratthlvar will be paraded on mada streets and later Chakrasnanam will be performed in the temple Pushkarini.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాదశికి భక్త కోటితో టిటిడి స్థానిక ఆలయాలు శ్రీనివాసమంగాపురంలో వైకుంఠద్వార దర్శనంతో పులకించిన భక్తులు

తిరుపతి, 2018 డిసెంబరు 18: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలు భక్త కోటితో నిండిపోయాయి. టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శనంతో భక్తులు పులకించిపోయారు. వేకువ జామున 12.05 గంటల నుండి 12.30 గంటల వరకు తిరుపల్లచ్చితో శ్రీవారిని మేల్కొొలిపారు. అనంతరం 3 గంటల వరకు మూలవర్లకు తోమాల సేవ, కొలువు తదితర ఏకాంత సేవలను నిర్వహించారు. మంగళవారం ఉదయం 3 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠ ద్వారాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని వైకుంఠద్వార ప్రవేశం చేశారు. ఆలయం వద్ద వివిధ రకాల పుష్పాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరణ చేశారు. టిటిడి అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు భక్తులకు సేవలందించారు.

ఎస్వీ మ్యూజిక్ కాలేజీ ఆధ్వర్యంలో ఉదయం 6 నుండి 6.30 గం.ల వరకు మంగళధ్వని నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.30 గం.ల వరకు ఎస్వీ హయ్యర్ వేదిక్ విద్యార్థుల ఆధ్వర్యంలో వేద పారాయణం చేశారు. ఉ.7.30 నుండి 8.30 గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం, ఉ.8 నుండి 10 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఉ.10 నుండి 11.30 గంటల వరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ధార్మిక కార్యక్రమాలను చేపట్టారు. సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు భక్తి సంగీతం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు హరికథ జరుగనుంది.

బుధవారం చక్రస్నానం

డిసెంబరు 19వ తేదీ ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను నాలుగు మాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం పుష్కరిణిలో శాస్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తారు.

ఇతర వివరాలకు news.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.