V DAY CELEBRATIONS AT TTD LOCAL TEMPLE_ వైకుంఠ ఏకాదశికి భక్త కోటితో టిటిడి స్థానిక ఆలయాలు

Tirupati, 18 Dec. 18: It was pious and devotion laden environment every where as part of V Day celebrations at all TTD sub temples is and out of Tirupati on December 18 and 19. Besides colourful flower and electrical decorations, special rituals and Anna Prasadam were organised and sarva darshan commenced from early hours.

AT TIRUCHANOOR

On Vaikunta Ekadasi day on Tuesday, special pujas were held at Goddess Padmavati temple, Tiruchanoor in the morning, sarva darshan commenced from 7.30am till 9.45pm followed by procession of utsava idols on mada streets.

On December 19, after suprabath seva, charasnanam is performed for Sri Sudarshana Chakrathalvar after Thirumanjanam in the temple Pushkarani.

AT APPALAYAGUNTA

At Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta sarva darshan commenced at 5.00 AM after Tiruppavai, Tomala, and Kolu vu, Archana etc.

On December 19 on the occasion of Dwadasi, Chakrasnanam will be performed after morning rituals. TTD has made elaborate arrangements for drinking water, Anna Prasadam and security for devotees.

Similar special rituals were performed at Sri Kalyana Venkateswara temple Narayavanam, Sri Veda Narayana Swamy temple in Nagalapuram, Sri Govindaraja Swamy temple, Sri Kodandarama Swamy temple, Sri Venugopal temple in Karvetinagaram, Sri Venkateswara Swamy and Padmavati temple in Pithapuram, Sri Konetiraya Swamy temple in Keelapatla, Sri Pattabirama Swamy temple at Valmikipuram, Sri Prasanna Venkateswara temple in Kosuvaripalli, Sri Venkateswara Swamy temple in Bangalore on the occasion of Vaikunta Ekadasi and Dwadasi celebrations.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాదశికి భక్త కోటితో టిటిడి స్థానిక ఆలయాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…

తిరుపతి, 2018 డిసెంబరు 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాదశి నాడు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటల నుండి సర్వదర్శనం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు నాలుగు మాడ వీధులలో ఉత్సవర్లును ఊరేగించారు. విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రాత్రి 9.45 గంటలకు ఏకాంత సేవను నిర్వహించారు.
వైకుంఠ ద్వాదశిన చక్రస్నానం
డిసెంబరు 19వ తేదీ ద్వాదశి నాడు ఉదయం 3.00 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలుపుతారు. ఉదయం 7.00 గంటల నుండి 9 గంటల వరకు పంచమీ తీర్థంలో చక్రతాళ్వార్లకు తిరుమంజనం నిర్వహించి చక్రస్నానం నిర్వహిస్తారు.

అప్పలాయగుంటలో …

వైకుంఠ ఏకాదశి సందర్భంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వేకువజామున 3.30 నుండి 4.00 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉ. 4.00 నుండి 5.00 గంటల వరకు మూలవర్లకు తోమాల, కొలువు, అర్చన, విశేష నివేదన చేశారు. ఉదయం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరిగింది. ఉదయం 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమంచారు. భక్తులు విశేషంగా విచ్చేసి శ్రీపసన్న వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.

19న ద్వాదశి

డిసెంబర్ 19న ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 గంటలకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొొలుపుతారు. ఉ.8.00 గంటల నుండి 9.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఉ.9 గంటల నుండి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. అనంతరం ఉదయం 10.00 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు.

నారాయణవనంలో …

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 5 నుండి 6 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించారు.

నాగలాపురంలో …

నాగలాపురంలోని శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 3.00 నుండి 4.30 గంటల వరకు తిరుపాల్లచ్చితో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఉదయం 9.00 గంటలకు ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.

అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామ స్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయం, బెంగుళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.