VAIKUNTA RAMA RIDES GARUDA VAHANA _ గరుడ వాహనంపై వైకుంఠ రాముడు
Tirupati, 17 Mar. 21: On the fifth day of the ongoing annual Brahmotsavam of Sri Kodandaramaswami temple at Tirupati in Sri Vaikunta Rama alankaram blessed devotees on Garuda vahana on Wednesday evening.
The annual fete is being observed in Ekantham as per Covid guidelines.
Garuda seva is most significant among Brahmotsavams. Garuda is a chariot of Sri Mahavishnu and is hailed as sacrosanct.
Tirumala Pontiffs, temple special grade DyEO Smt Parvati, AEO Sri Durgaraju, Superintendent Sri Ramesh and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గరుడ వాహనంపై వైకుంఠ రాముడు
తిరుపతి, 2021 మార్చి 17: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం రాత్రి గరుడ వాహనం వాహనంపై స్వామివారు అభయమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు
నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడు. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ఎం.రమేష్ రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.