BOOKLET RELEASED _ వరలక్ష్మీ వ్రతం కరపత్రాలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో
వరలక్ష్మీ వ్రతం కరపత్రాలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో
తిరుపతి, 2024 ఆగష్టు 12: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ జరుగనున్న వరలక్ష్మీ వ్రతం కరపత్రాలను సోమవారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగనుందన్నారు. అదేరోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.