VASTRAMS FROM SRI RANGAM TEMPLE ALSO PRESENTED_ శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

Tirumala, 17 Jul. 19: A special set of Silk Vastrams were also presented to Lord by Sri Rangam Devasthanam on this occasion. Usually, the TTD will gift the silk vastrams to Lord Sri Ranganatha Swamy of Sri Rangam once in a year during Kaisika Ekadasi Day. The Sri Rangam Devasthanam follows a similar procedure of gifting the silk vastrams to Lord Venkateswara during Anivara Asthanam day.

HH Sri Sri Pedda Jeeyar Swamy, HH Sri Sri Chinna jeeyar Swamy, TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Spl Officer Sri AV Dharma Reddy, Temple DyEO Sri Haridranath, Tamil Nadu Endowment Addl Secretary Smt Apporva Varma, Sri Rangam Temple Joint Commissioner Sri Jayaraman and others were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

తిరుమల, 2019 జూలై 17: ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం నుంచి శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలతో సారెను తమిళనాడు రాష్ట్ర దేవాదాయశాఖ అద‌న‌పు కమిషనర్‌ శ్రీమతి అపూర్వ వ‌ర్మ‌, జాయింట్‌ కమిషనర్‌ శ్రీ జయరామన్‌లు కలిసి సమర్పించారు.

బుధ‌వారం ఉదయం శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకువెళ్ళారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ధ‌ర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.