ANIVARA ASTHANAM PERFORMED IN A RELIGIOUS MANNER IN TIRUMALA TEMPLE_ శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆణివార ఆస్థానం
Tirumala, 17 Jul. 19: Salakatla Anivara Asthanam has been observed with religious fervour in the hill shrine of Lord Venkateswara on Wednesday in Tirumala. This festival is one among the 450 important festivals that are being performed in Srivari Temple every year.
BUDEGET FETE OF THE TEMPLE
The uniqueness about this festival is that the previous year’s accounts of the office are presented before the deity by the principal officers and are taken back to signify that the ‘Lord’ finds the officers fit enough to hold their respective offices. New books will also be issued for recording finances of the next fiscal. In the temple terms, this entire process is called “Asthanam” which will be performed inside sanctum sanctorum near Bangaru Vakili in the presence of processional deities of Lord Malayappa Swamy and his two consorts Sridevi and Bhudevi.
In connection with this festival, TTD has cancelled all arjitha sevas like Sahasra Kalasabhishekam, Kalyanotsavam, Unjal seva, Brahmotsavam, Vasanthotsavam, Sahasra Deeplankara seva.
The Asthanam- temple court was performed at the Bangaru Vakili inside the sanctum sanctorum between 7am and 9am. The presiding deity of Sri Venkateswara Swamy is decorated with four new vastrams which were decked for Kireetam, Khadgam, Tomala and Uttariyam while the remaining two to the utsava murthies of Sri Malayappa Swamy and chief commander Vishvaksena. These six silk vastrams are being presented by Tirumala Pedda Jiyangar Sri Periyakoil Kelviyappan Sadagopa Ramanuja Jeeyar along with Chinna Jiyangar Sri Narayana Ramanuja Chinna Jeeyar as a part of the ritual. Then the temple priests offered four types of Haratis including Tallapaka Annamaiah Harati, Tarigonda Vengamamba Harati, Mysore Maharaja Harati and Rupai Harati to Lord.
TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Spl Officer Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆణివార ఆస్థానం
తిరుమల, 2019 జూలై 17: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ముందుగా ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.
అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్, ఛైర్మన్, ఈవో, తిరుమల ప్రత్యేకాధికారి, ఇతర ఉన్నతాధికారులు వెంటవచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.
తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌కు ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచారు. అనంతరం ఆస్థానం ముగిసింది.
వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు :
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
ఆర్జితసేవలు రద్దు :
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా జూలై 17న బుధవారం ఆణివార ఆస్థానం కారణంగా సహస్ర కళాశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.టిటిడి రద్దు చేసింది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.