CVSO GEARS UP PERSONNEL FOR RATHOTSAVAM AND CHAKRASNANAM _ రథోత్సవం, చక్రస్నానానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాధ్‌జెట్టి

Tirumala, 6 October 2019:With the two important events of Rathotsavam and Chakrasnanam left during the ongoing annual brahmotsavams,  CVSO Sri Gopinath Jatti convened a meeting with vigilance sleuths at PAC 4 in Tirumala on Sunday. 

He discussed the deployment plan along with Additional CVSO Sri Sivakumar Reddy,  VGO Manohar. 

Later he called upon the 1200 vigilance personnel to discharge their duties with the same enthusiasm as they have performed on Garuda Seva. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రథోత్సవం, చక్రస్నానానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు  – టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాధ్‌జెట్టి

తిరుమల, 2019 అక్టోబ‌రు 06: శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబ‌రు 7వ తేదీ సోమ‌వారం ఉదయం స్వామివారి రథోత్సవం, ఆక్టోబరు 8వ తేదీ మంగ‌ళ‌వారం చక్రస్నానానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాధ్‌జెట్టి టిటిడి విజిలెన్స్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పిఎసి 4 లో ఆదివారం విజిలెన్స్ అధికారుల‌తో స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి గరుడవాహనసేవను విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేసిన విజిలెన్స్‌ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రీవారి రథోత్సవం, చక్రస్నానానికి  భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు రథం లాగేటపుడు భద్రత సిబ్బంది తీసుకోవలసిన ఏర్పాట్లు వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు దూరంగా వుండే విధంగా జాగ్రత తీసుకోవాలని సూచించారు. చక్రస్నానికి మహిళలు, వృద్ధులు, చంటిపిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అనంత‌రం గ‌రుడ‌సేవ‌లో విధులు నిర్వ‌హించిన 1200 విజిలెన్స్ సిబ్బందిని అభినందించి, అదే ఉత్సాహంతో ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానంలో తమ విధులను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, విజివోశ్రీ మ‌నోహ‌ర్‌, ఎవిఎస్‌వోలు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.