VEENADHARI BESTOWS WISDOM ON DEVOTEES _ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

Tiruchanoor, 12 Nov. 20: As Veenadhari, Goddess Padmavathi in all Her splendour blessed devotees on Hamsa Vahanam.

As part of ongoing Navahnika Karthika Brahmotsavams at Tiruchanoor, Goddess graced on the divine carrier as Gnanaroopini Saraswathi holding Veena in her hands and eloquently seated on Hamsa Vahana on Thursday evening.

TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, JEO Sri P Basanth Kumar, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, DyEO Smt Jhansi Rani and others were also present.

VAHANA SEVAS IN EKANTAM

In view of Covid, the annual brahmotsavams at Tiruchanoor will also be observed in Ekantam akin to Tirumala Brahmotsavams, said TTD Trust Board Chief Sri YV Subba Reddy.

The Chairman who participated in Hamsa Vahana Seva on Thursday said, the decision was taken following the guidelines of Central and State governments, keepin in view pilgrim health security, he added.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి
 
తిరుపతి, 2020 న‌వంబ‌రు 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను ”పరమహంస”లుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌ కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
శ్రీ పద్మావతి అమ్మవారి హంస వాహనసేవలో టిటిడి ఛైర్మన్
 
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం రాత్రి జరిగిన హంస వాహన సేవలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 11న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయని‌,  ఈ నెల 19వ తేదీ వరకు జ‌రుగ‌నున్నాయని తెలిపారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నామన్నారు. ఈరోజు ఉద‌యం పెద్ద‌శేష వాహ‌నం, రాత్రి హంస వాహ‌న‌సేవ జ‌రిగాయన్నారు. భక్తులందరిపై అమ్మవారి దయ ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.