“VEENADHARI” PADMAVATI _ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

TIRUPATI, 29 NOVEMBER 2024: Holding the string instrument in Her hands and sitting gracefully on Hamsa-the Swan carrier, Sri Padmavati Devi as Veenadhari Saraswati, the Goddess of knowledge and wisdom blessed devotees.

HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, EO Sri J Syamala Rao, JEOs Smt Goutami, Sri Veerabrahmam and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

తిరుపతి, 2024 నవంబరు 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్ర‌వారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.

హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

వాహనసేవలో ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీ‌మ‌తి గౌత‌మి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీసుభాష్, శ్రీ చ‌ల‌ప‌తి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.