VENGAMAMBA IS A MULTI TALENTED PERSON-SCHOLARS_ వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం : ఆచార్య కె.జె.కృష్ణమూర్తి

Tirupati, 18 August 2018: Matrusri Tarigonda Vengamamba was not only a spiritual person, renowned scholar, philanthropist but a multi talented personality, opined the scholars.

On the occasion of 201st Vardanti of the saint poetess, a seminar was organised on Saturday i. Annamacharya Kalamandiram in Tirupati.

Dr.KJ Krishnamurthi, Vengamamba Project co-ordinator said, with her multi faceted talents, she pioneered women empowerment almost three centuries ago”, he observed.

Dr. A Vibhishana Sharma, Smt Muktevi Bharati, Smt K Mahalakshmi, Dr Sangeetham Keshavulu also delivered lectures on many topics related to Vengamamba life.

While in the evening, renowned musician Sri G Madhusudhan Rao concert will be performed in the premises.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం : ఆచార్య కె.జె.కృష్ణమూర్తి

ఆగస్టు 18, తిరుపతి, 2018: శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శించిన కవయిత్రి వెంగమాంబ మహిళాభ్యుదయాన్ని కాంక్షిస్తూ రచనలు చేశారని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి పేర్కొన్నారు. వెంగమాంబ 201వ వర్ధంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ”మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – శ్రీ భాగవతం” అనే అంశంపై ఉపన్యసించారు. పోతన శైలిని అనుసరిస్తూనే స్వతంత్ర భావాలతో శ్రీభాగవతం ద్విపద కావ్యాన్ని వెంగమాంబ రచించారని తెలిపారు. ఇందులో వెంగమాంబ దర్శించిన శ్రీకృష్ణుని రూపాన్ని వర్ణించారని చెప్పారు. ద్విపద కావ్యాలతోపాటు శ్రీవారిని స్తుతిస్తూ శతకాలు, యక్షగానాలు, శ్రీ వేంకటాచల మహత్యం గ్రంథాన్ని రచించారని తెలిపారు.

తిరుపతికి చెందిన డా|| ఆకెళ్ల విభీషణశర్మ ”మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – శ్రీవేంకటాచల మహత్యం” అనే అంశంపై మాట్లాడుతూ వ్యాసులవారు సంస్కృతంలో వరాహ పురాణంలోని భవిష్యోత్తర పురాణంలో 44 అధ్యాయాల్లో చెప్పిన అంశాలను శ్రీవేంకటాచల మహత్యం గ్రంథంలో కేవలం 6 ఆశ్వాసాల్లోనే వెంగమాంబ తెలియజేశారని వివరించారు. ఇందులో శ్రీవారి కల్యాణఘట్టాన్ని సరళంగా, సుందరంగా భక్తులకు అందించారని చెప్పారు.

అనంతరం హైదరాబాద్‌కు చెందిన ఆచార్య ముక్తేవి భారతి ”మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – యక్షగానాలు” అనే అంశంపై, తిరుపతికి చెందిన ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి ”మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – శ్రీ వేంకటేశ్వర కృష్ణమంజరి” అనే అంశంపై, చంద్రగిరికి చెందిన డా|| సంగీతం కేశవులు”ప్రాచీనాంధ్ర కవయిత్రులలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సాహితీ ప్రస్థానం” అనే అంశంపై ఉపన్యసించారు.

సాయంత్రం 6 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ జి.మధుసూదనరావు బృందం సంగీతసభ జరుగనుంది.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు రీసెర్చి అసిస్టెంట్‌ డా|| సి.లత, హెచ్‌డిపిపి కో-ఆర్డినేటర్‌ శ్రీ చెన్నకేశవులునాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.