MANAGUDI SARE GETS THE BLESSINGS OF LORD VENKATESWARA_ మనగుడి సామగ్రికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

Tirumala, 18 August 2018: As the 12th phase of Managudi is set.to take place in two Telugu States from August 23 to 26, Managudi puja materials were placed at the holy feet of Lord Venkateswara on Sunday.

A procession of sare commenced from Bedi Anjaneya Swamy temple. Speaking on this occasion, temple DyEO Sri Harindranath said, Managudi fete will be observed in around 12 thousand temples in AP and TS. “The puja materials will be dispatched to the respective temples after receiving the divine blessings of Lord”, he added.

Later TTD Trust Board member Sri Rama Chandra Reddy, Hindu Dharma Prachara Parishad Secretary Sri Ramana Prasad, temple DyEO Sri Harindranath and other officials carried the sare over head and placed at the lotus feet of presiding deity.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మనగుడి సామగ్రికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆగస్టు 18, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం మనగుడి పూజా సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుండి మనగుడి పూజాసామగ్రిని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయంలో శ్రీవారి పాదాల వద్ద మనగుడి సామగ్రిని ఉంచి పూజలు చేశారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌ మాట్లాడుతూ ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపికచేసిన 11,730 ఆలయాల్లో 12వ విడత మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం అక్షింతలు, కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ తదితర పూజాసామగ్రిని శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశామన్నారు. అనంతరం పూజాసామగ్రిని ఆయా ఆలయాలకు పంపామన్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక భజన మండళ్ల సభ్యులు, శ్రీవారి సేవకులు కలిసి మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ మాట్లాడుతూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా టిటిడి నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.