VINAYAKA PUJA BY TTD TRANSPORT DEPARTMENT ON SEP 2_ సెప్టెంబరు 2న టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో మొదటి ఘాట్ రోడ్డులో వినాయక చవితిపూజ
Tirupati, 31 Aug. 19: TTD Transport department plans to grandly conduct Ganesh Chaturthi pujas at the holy Vinayaka temple on the First Ghat Road-1 and 2nd Ghat Road on September 2.
Transport department General Manager Sri Sesha Reddy made all arrangements for the holy festival.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 2న టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో మొదటి ఘాట్ రోడ్డులో వినాయక చవితిపూజ
తిరుపతి, 2019 ఆగస్టు 31: వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 2న టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని శ్రీవినాయకస్వామివారికి వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9.00 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. టిటిడి ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శ్రీ శేషారెడ్డి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అదేవిధంగా, రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలోనూ వినాయక చవితి సందర్భంగా మూలవర్లకు అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.