VARAHA JAYANTHI ON SEPTEMBER 1_ శ్రీ వరాహస్వామి జయంతికి ఏర్పాట్లు పూర్తి

Tirumala, 31 Aug. 19: The annual Varaha Jayanthi festival will take place in Sri Bhu Varaha Swamy temple at Tirumala on September 1.

TTD has made all arrangements for the special abhishekam which is to be performed to the presiding deity on Sunday.

Pilgrims will be allowed for darshan after the special abhishekam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ వరాహస్వామి జయంతికి ఏర్పాట్లు పూర్తి

తిరుమల, 2019 ఆగ‌స్టు 31: ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1న వరాహ జయంతిని నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేస్తారు. ఆ త‌రువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారు. భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామివారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.