YOGA NARASIMHA ON SIMHA VAHANAM _ సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప

Tirumala, 06 October 2024: The third day witnessed Sri Malayappa as Yoga Narasimha in the ferocious Simha Vahana.

Marching ahead the four mada streets Sri Yoga Narasimha seated majestically in a meditative pose representing inner peace and tranquility.

TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప

తిరుమల, 2024 అక్టోబ‌రు 06: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

సింహ వాహనం – ధైర్య‌సిద్ధి

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీ శ్రీనివాసవర్మ, హైకోర్టు జడ్జి జ‌స్టిస్ బివిఎల్ఎన్‌ చ‌క్ర‌వ‌ర్తి, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు దంప‌తులు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి దంప‌తులు, జేఈవోలు శ్రీమ‌తి గౌత‌మి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ శ్రీ‌ధ‌ర్‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది