YOUTH BREAK THE “HANDI” WITH ENTHUSIASM AS DEITIES CHEER_ తిరుమలలో ఘనంగా ఉట్లోత్సవం

Tirumala, 4 September 2018: The Handi Breaking festival, Utlotsavam as popular in vernacular language was observed with religious fervour on Tuesday evening in Tirumala.

A day after Gokulastami, this Utlotsavam is being observed at various points encircling Tirumala temple every year. Hundreds of youth took part in this entertaining fete opposite Tirumala temple. They had broken the mud pot which is tied atop a 20 feet pole.

Earlier Sri Malayappa Swamy on Golden Tiruchi accompanied by Sri Krishna Swamy on another Tiruchi was taken on a procession covering all the vital points. The interesting feature about this festival is that during all other festivals, the pilgrims throng to witness the grandeur of deities, but here, the deities became the spectators for Utlotsavam.

TTD EO Sri Anil Kumar Singhal said, Gokulastami and Utlotsavam have been observed with religious pomp and gaiety in Tirupati and Tirumala for two days. The devotees also took part in these celestial fetes with great devotion and enthusiasm.

Temple DyEO Sri Harindranath, VGO Sri Ravindra Reddy and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో ఘనంగా ఉట్లోత్సవం

సెప్టెంబరు 04, తిరుమల, 2018: తిరుమలలో మంగళవారంనాడు ఉట్లోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులోభాగంగా శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ 16 ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించినట్టు తెలిపారు. భక్తులందరిపై శ్రీమలయప్పస్వామి, శ్రీకృష్ణస్వామివారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా ఈవో ఆకాంక్షించారు.

ముందుగా శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా శ్రీ పెద్దజీయర్‌ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఉట్లోత్సవం, ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత హథీరాంజీ మఠానికి, కర్ణాటక సత్రాలు తదితర ప్రాంతాల్లో ఉట్లోత్సవం నిర్వహించారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు ఆద్యంతం కోలాహలంగా సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లను పగులగొట్టారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఓ శ్రీ హరీంద్రనాథ్‌, విజిఓ శ్రీ రవీంద్రారెడ్డి, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.