PUBLICITY MATERIAL DISTRIBUTED_ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ప్రచారం

Tirumala, 4 September 2018: As a part of wide publicity campaign for ensuing annual and Navarathri Brahmotsavams, TTD has taken up the distribution of pamphlets, wall posters with Srivari Sevakulu in Tirupati and Tirumala.

For this purpose TTD has printed one lakh pamphlets, 12 thousand wall posters and eight thousand pamphlets in all Telugu, Tamil, Kannada, Hindi and English.

These materials were already distributed to TTD Kalyana Mandapams, Information Centres while the Sevakulu pasted the wall posters to various RTC buses en route Karnataka, Tamilnadu and Telengana states.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ప్రచారం

సెప్టెంబరు 04, తిరుమల, 2018: శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించేందుకు టిటిడి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందుకోసం 12 వేల గోడపత్రికలు, ఒక లక్ష పత్రికలు, 8 వేల బుక్‌లెట్లను ముద్రించింది. అన్ని ప్రాంతాల భక్తులకు అర్థమయ్యేలా తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో గోడపత్రికలు, సాధారణ పత్రికలు రూపొందించింది.

వాహనసేవల వివరాలు, ఇతర సమాచారంతో కూడిన పత్రికలను తిరుమల, తిరుపతిలోని సమాచార కేంద్రాలు, మే ఐ హెల్ప్‌ యు కౌంటర్లు, సర్వదర్శనం కౌంటర్ల ద్వారా భక్తులకు పంపిణీ జరుగుతోంది. దేశవ్యాప్తంగా గల టిటిడి కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో ఇప్పటికే గోడపత్రికలను అంటించి భక్తులకు సమాచారం తెలియజేశారు. తిరుమల-తిరుపతి బస్సులతోపాటు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తిరుపతికి రాకపోకలు సాగిస్తున్న బస్సులకు గోడపత్రికలు అంటించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ఆర్‌టిసి, పర్యాటక శాఖ అధికారులకు ప్రచార సామగ్రిని అందించారు. ఆయా రాష్ట్రాల ఆర్‌టిసి బస్సులకు అంటించడంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో గోడపత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. టిటిడి ప్రజాసంబంధాల విభాగం సిబ్బంది ఆర్‌టిసి అధికారులతో సమన్వయం చేసుకుని శ్రీవారి సేవకుల సహకారంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు గోడపత్రికలను అంటిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.