JEO H&E COMMENCES CRICKET FOR EMPLOYEES _ ఉద్యోగుల క్రికెట్ పోటీలను ప్రారంభించిన జేఈవో

TIRUPATI, 14 FEBRUARY 2023: Commencing Cricket Matches at SV High School Grounds for TTD employees, JEO for Health and Education, Smt Sada Bhargavi said the ground will get a complete facelift in another six months time.

The JEO opened the Table Tennis court in the Recreation Hall on Tuesday. She said, following the request from Employees, TTD Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy have immediately sanctioned Rs.84lakhs for developing the spacious grounds.

At present Volley Ball, Cricket and Shuttle Courts along with a Recreation Hall to conduct indoor games like Carroms, Chess, Table Tennis were set ready.

Welfare Officer Smt Snehalata, EE Sri Murali and other participants were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఉద్యోగుల క్రికెట్ పోటీలను ప్రారంభించిన జేఈవో

– 6 నెలల్లో ఎస్వీ హైస్కూల్ మైదానం పూర్తి స్థాయిలో అభివృద్ధి

తిరుపతి, 14 ఫిబ్రవరి 2023: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా మంగళవారం తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అదే విధంగా ఇక్కడి రిక్రియేషన్ హాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ టేబుల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఉద్యోగులు కోరిన వెంటనే మైదానం అభివృద్ధి కోసం చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి రూ.84 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ క్రికెట్, వాలీబాల్, షటిల్ కోర్టులతోపాటు రిక్రియేషన్ హాల్లో టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ క్రీడలు ఆడేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 6 నెలల్లో ఇతర క్రీడా పరికరాలను సమకూర్చి, గోడలకు క్రీడాంశాలతో కూడిన చక్కటి పెయింటింగ్ తో మైదానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఫిబ్రవరి 2న ప్రారంభమైన క్రీడాపోటీలు 20వ తేదీ వరకు జరుగుతాయని, విజేతలుగా నిలిచిన వారికి ముగింపు సమావేశంలో బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అనేక చర్యలు చేపడుతోందన్నారు . ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ఈ ఈ శ్రీ మురళి ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.