DEVOTEES ARE APPEALED TO AVOID TIRUMALA PILGRIMAGE IN THE CASE OF COUGH, COLD AND FEVER – ADDITIONAL EO _ క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు విస్తృత చ‌ర్య‌లు – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 7 Mar. 20: While asserting on the preventive measures taken by TTD to avoid Corona Virus in Tirumala, the Additional EO of TTD appealed to devotees to re schedule their pilgrimage to Tirumala if they are suffering from cough, cold and fever. 

A meeting on how to tackle corona virus was held at Gokulam Rest House in Tirumala on Saturday evening.

“We have taken all preventive measures in Tirumala to prevent the entry and spread of corona virus. As a part of it, we have taken up widespread publicity through SVBC and Radio and Broad casting announcements in the places where pilgrim and TTD employees interface and in more. 

Apart from this, the health department will take up disinfection cleaning measures for every two hours in queue complexes, CRO etc. 

A committee has been constituted with Health Officer, DyEOs R1, R2, and Temple to closely monitor the issue. If anyone is seen suffering from mild fever, immediately Thermal Screening will be done and any symptoms are found will be sent to SVIMS for better treatment.

We also appeal to the devotees to avoid or postpone their pilgrimage, if they are suffering from cough, cold and fever as there are chances of spreading is more in a place like Tirumala which is always abuzz with pilgrim activity especially at CRO, Darshan compartments and queue lines, Kalyanakatta, Annaprasadam etc. 

“Please come with preparedness if you are visiting Tirumala and carry sanitizers and masks along with you. Maintain three feet distance to avoid the spread of infection”, he added. 

Health Officer Dr RR Reddy, Aswini Hospital Chief Dr Narmada, DyEOs Sri Harindranath, Sri Damodaram, Sri Venkataiah, Sri Nagaraja, Catering Officer Sri Sastry, VGO Sri Manohar, PRO Dr T Ravi and others were also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు విస్తృత చ‌ర్య‌లు – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2020 మార్చి 07: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ప్ర‌తి రోజు దేశ విదేశాల నుండి విచ్చేసే వేలాది మంది భ‌క్తులకు క‌రోనా వైర‌స్ సోక‌కుండా విస్తృతంగా వైద్య, పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతి భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో శ‌నివారం సాయంత్రం అద‌న‌పు ఈవో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భ‌క్తుల‌లోనూ, ఉద్యోగుల్లోనూ క‌రోనావైర‌స్ విస్త‌రించ‌కుండా తీసుకోవ‌ల‌సిన ప్రాధ‌మిక జాగ్ర‌త్త‌ల‌పై విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌న్నారు. టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగాల‌ ద్వారా తిరుమ‌ల‌లోని ముఖ్య కూడ‌ళ్ల‌లోనూ, ర‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల‌లో నిరంత‌రాయంగా ప్ర‌చారం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా భ‌క్తుల‌లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చిన్న ప్రోమో త‌యారు చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, ఎల్ఇడి స్క్రీన్‌లు ఉన్న ప్రాంతాల‌లో ప్ర‌సారం చేయాల‌న్నారు. తిరుమ‌ల‌లోని అన్ని ప్రాంతాలు, వ‌స‌తి స‌మూదాయాలు, భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉన్న ప్రాంతాల‌లో ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి అంటు రోగ నివార‌ణ మందుల‌తో ప‌రిస‌రాల‌ను శుభ్రం చేయాల‌ని ఆరోగ్య విభాగం అధికారుల‌ను ఆదేశించారు.  

భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. ఇందులో భాగంగా మాస్కులు ధ‌రించాల‌ని, మ‌నుషుల మ‌ధ్య 3 అడుగుల దూరాన్ని పాటించాల‌న్నారు. ఎవ‌రైనా భ‌క్తులు జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు వారికి థ‌ర్మ‌ల్ స్కానింగ్ చేసి త‌ద్వారా త‌గిన వైద్యం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. అలిపిరి. శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గాల‌లో ప్ర‌త్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేయాల‌ని వైద్య అధికారుల‌ను ఆదేశించారు.  క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు నిరంత‌ర‌ ప‌ర్యవేక్ష‌ణ‌కు రిసెప్షన్ 1 మ‌రియు 2 డెప్యూటీ ఈవోలు, ఆల‌య డెప్యూటీ ఈవో, ఆరోగ్యశాఖాధికారితో క‌మిటీని ఏర్పాటు ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు.

తిరుమ‌ల‌లో ప్ర‌తి నిత్యం వేలాది మంది భ‌క్తులు ఉంటారు కావున జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌వారు ద‌య‌చేసి త‌గ్గిన త‌ర్వాత మాత్ర‌మే తిరుమ‌ల‌కు రావాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ స‌మావేశంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, రిసెప్షన్‌-2 డెప్యూటీ ఈవో శ్రీ ధామోద‌రం,  రోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, అశ్విని ఆసుప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డా.. న‌ర్మ‌ద‌, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో శ్రీ నాగ‌రాజు, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి, త‌దితర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.