EO TAKES PART IN KANCHI SEER ARADHANOTSAVAM _ కంచి స్వామి ఆరాధ‌నోత్స‌వాల‌లో పాల్గొన్న టిటిడి ఈవో

Tirumala, 7 Mar. 20: TTD EO Sri Anil Kumar Singhal on Saturday took part in the Aradhana Mahotsavam of Kanchi Seer Sri Jayaendratheertha Swamy. 

After serving renowned spiritual Kanchi mutt as 69th Seer, Sri Jayendra Theertha Swamy attained Sivaikyam on February 28 in 2018.  

The second aradhana mahotsavams are being observed by the mutt under the instructions of the present seer Sri Vijayendra Saraswathi Swamy who is been serving as the 70th seer of the Kanchi Kamakoti Peetham. 

TTD EO who took part on the last day of the Aradhanotsavam on Saturday and presented vastram and prasadam of Lord Venkateswara. Temple OSD Sri P Seshadri was also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

కంచి స్వామి ఆరాధ‌నోత్స‌వాల‌లో పాల్గొన్న టిటిడి ఈవో  

తిరుమల, 2020 మార్చి 07: కంచిలోని పూజ్య శ్రీ జయేంద్రసరస్వతి శంకరాచార్య స్వామివారి 2వ ఆరాధనోత్సవాల సంద‌ర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి శ‌నివారం ఉద‌యం టిటిడి త‌ర‌పున వ‌స్త్రాల‌ను  స‌మ‌ర్పించారు. పూజ్య శ్రీ జయేంద్రసరస్వతి శంకరాచార్య స్వామివారి బృందావనంలో మార్చి 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు 2వ ఆరాధనోత్సవాలు నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే.
 
ఈ సంద‌ర్బంగా టిటిడి ఈవో మాట్లాడుతూ 8వ శతాబ్దంలోనే భారతదేశంలో ఆధ్యాత్మిక భక్తి చైతన్యానికి శ్రీకారం చుట్టిన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యులు కంచి పీఠాన్ని స్థాపించార‌న్నారు.

హిందూ సనాతన ధర్మ ఉద్ధరణే పరమావధిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ పీఠాల్లో కంచి కామకోటి పీఠం అగ్రస్థానంలో ఉంద‌న్నారు. పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారు 69వ పీఠాధిపతిగా సేవలందించార‌ని తెలిపారు. 2018, ఫిబ్రవరి 28న పూజ్యశ్రీ జయేంద్రసరస్వతి శంకరాచార్య స్వామివారు శివైక్యం చెందిన‌ట్లు వివ‌రించారు.

ముందుగా కంచి పీఠం 70వ పీఠాధిపతి పూజ్యశ్రీ శంకర విజయేంద్రసరస్వతి శంకరాచార్య స్వామివారికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి  శేష వస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ శంకర విజయేంద్రసరస్వతి శంకరాచార్య స్వామివారు ఈవో, అద‌న‌పు ఈవోను ఆశీర్వదించారు.  ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.