TEPPOTSAVAMS ENTERS DAY 3 _ తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారి క‌టాక్షం

Tirumala, 7 Mar. 20: Lord Malayappa Swamy flanked by Sridevi and Bhudevi took out pleasure ride on the finely day decked Teppa. 

The float festival is one of most important fetes observed in a grand manner in Tirumala. 

On Saturday evening, the utsava deities dazzled on float and blessed devotees taking pleasure ride on holy waters of Swamy Pushkarini for three times. 

EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, Temple Dy EO Sri Haridranath and other officers of TTD were also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారి క‌టాక్షం

తిరుమల, 2020 మార్చి 07: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ‌నివారం సాయంత్రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పలపై భక్తులను క‌టాక్షించారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వ‌హించి పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. రాత్రి 7 గంటల నుండి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మ‌వార్లు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.

కాగా, శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు నాలుగో రోజు ఐదుచుట్లు, చివ‌రి రోజు ఏడుచుట్లు పుష్క‌రిణిలో తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.