RAJAMANNAR ALANKARAM ON KALPAVRUKSHA VAHANAM _ క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై రాజ‌మ‌న్నార్ అలంకారంలో శ్రీ‌ మలయప్ప అభ‌యం

Tirumala, 19 October 2020: On the fourth day of Srivari Navaratri Brahmotsavams on Monday Sri Malayappa enthralled devotees on Kalpavruksha Vahanam in Rajamannar alankaram.

Due to COVID-19 restrictions the utsava idols of Sri Malayappa and his two divine consorts mounted atop the golden Kalpavruksha Vahanam placed at the Kalyana Mandapam of Srivari temple.

Hindu mythology says that the Kalpavruksha Vahanam is embedded with divine Kalpavruksha, Kamadhenu and Chintamani. Known for granting boons to fulfil the devotees all worldly desires.

Srimad Bhagavatham says that all those who took shelter under Kalpavruksha became prosperous. Legends also say that the ‘Tree of Boons’ (Kalpavriksha) surfaced during the churning of ‘Ksheera Sagaram’ (milky ocean).

Sri Venkateshwara will bless devotees on Sarva Bhoopala Vahanam at night.

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, Board members Sri Chavireddy Bhaskar Reddy, Smt Prashanti Reddy, Dr Nischitha, Sri Chippagiri Prasad, Sri Govind Hari, Sri DP Ananth, Sri Kumaruguru, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై రాజ‌మ‌న్నార్ అలంకారంలో శ్రీ‌ మలయప్ప అభ‌యం

తిరుమల, 2020 అక్టోబరు 19: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు క‌ల్ప‌వృక్ష వాహనంపై రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో అభ‌య‌మిచ్చారు.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, డా. నిశ్చిత‌, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత‌, శ్రీ కుమార‌గురు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.