TTD EO INSPECTS KALYANA KATTA AT TIRUMALA _ క‌ల్యాణక‌ట్టను ప‌రిశీలించిన టిటిడి ఈవో

Tirumala, 19 Oct. 20: TTD Executive officer Dr KS Jawahar Reddy along with Additional EO Sri AV Dharma Reddy on Monday inspected the devotee facilities at the Kalyana Katta.

Speaking to Media persons later the TTD EO said as part of hiss daily visit to all establishments of TTD he inspected facilities for devotees at the Kalyana katta at Tirumala.

He said all precautionary guidelines of COVID-19 were in place at Kalyana Katta to facilitate comfortable and easy tonsuring and devotees were happy about the arrangements by TTD to redeem their vows to Lord Venkateshwara.

Earlier TTD EO inspected the Tonsuring hall, Later token counters and gave several instructions to officials on maintaining clean and disease free environment.

DyEO of Kalyana katta Sri R Selvam, SE-2Sri Nageswar Rao, Health officer Dr RR Reddy, VGOs Sri Manohar Sri Prabhakar and AEO Sri Ramakanth Rao and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

క‌ల్యాణక‌ట్టను ప‌రిశీలించిన టిటిడి ఈవో

తిరుమల, 2020 అక్టోబరు 19: టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి సోమ‌వారం అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి తిరుమ‌ల‌లోని క‌ల్యాణక‌ట్టను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా క‌ల్యాణ‌క‌ట్ట‌ వ‌ద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తి రోజు టిటిడిలోని అన్ని విభాగాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమ‌వారం క‌ల్యాణ‌క‌ట్ట‌లో భ‌క్తుల‌కు అందిస్తున్న సౌక‌ర్యాలు ప‌రిశీలించిన‌ట్లు తెలియ‌జేశారు.

శ్రీవారి భక్తులు సులువుగా, సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. కోవిడ్ – 19 దృష్ట్యా క‌ల్యాణ‌క‌ట్ట‌లో భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు బాగున్నాయ‌న్నారు. టిటిడి క‌ల్పిస్తున్న వ‌స‌తుల‌పై భ‌క్తులు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని ఆయ‌న వివ‌రించారు.  

అంత‌కుముందు ఈవో క‌ల్యాణక‌ట్ట‌లోని త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే హాల్‌లు, టోకెన్లు ఇచ్చే కౌంట‌ర్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లు ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.  

ఈ కార్యక్రమంలో డెప్యూటి ఈవో శ్రీ సెల్వం, ఎస్ ఇ – 2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, విజివోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఏఈవో శ్రీ ర‌మాకాంత్‌రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
         
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.