SRI PADMAVASINI ALANKARAM OF SRI PADMAVATI AMMAVARU AT TIRUCHANOOR SRI PAT _ శ్రీ ప‌ద్మావాసిని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు

Tiruchanoor, 19 Oct. 20 ;  On the 3rd day of Navarathri celebrations a Sri Padmavati Ammavari Temple, Tiruchanoor ,Goddess Padmavati blessed devotees on Monday in Sri Padmavasini  Alankaram .

In the morning the utsava idols of Ammavaru were given Snapana thirumanjanam at the Sri Krishna Mandapam. Later at night Unjal seva was observed for the utsava idols of Goddess.

Senior TTD officials and archakas participated in the celebrations.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ ప‌ద్మావాసిని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు

 తిరుపతి, 2020 అక్టోబ‌రు 19: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా మూడ‌వ రోజైన సోమ‌వారం అమ్మ‌వారు శ్రీ ప‌ద్మావాసిని అలంకారంలో దర్శనమిచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంత‌రం రాత్రి ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఊంజల్‌సేవ నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.