TTD ENTERS WORLD BOOK OF RECORDS _ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో టీటీడీ కి చోటు

ANOTHER FEATHER IN TTDs CAP-CHAIRMAN

TIRUMALA, 13 NOVEMBER 2021: In recognition of its bountiful and unique services of Tirumala Tirupati Devasthanams has entered into the World Book of Records adding one more feather in its cap, said TTD Chairman Sri YV Subba Reddy.

The London based Organization usually appreciates, honours and catalogues extraordinary records across the World with Authentic Certification and encourages individuals, organizations and firms to set new records at the Global level.

The WBR has certified Tirumala Tirupati Devasthanams(TTD) for being the world’s largest institution based on five major indicators viz. number of footfalls to the Hill Shrine of Sri Venkateswara Swamy, number of tonsures performed, number of laddus prepared, number of servings of Annaprasadam and hassle-free management of serpentine queue line.

On behalf of WBR Indian Wing President Mr Santhosh Shukla, Joint Secretary Mr Ullaji has handed over the Certificate to TTD Chairman in Tirumala on Saturday evening for its unique achievements and setting new records in temple administration.

CVSO Sri Gopinath Jatti was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో టీటీడీ కి చోటు

– టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి సర్టిఫికెట్ అందజేసిన సంస్థ ప్రతినిధి

– ఉద్యోగుల కృషితోనే ఈ గౌరవం : చైర్మన్

తిరుమల 13 నవంబరు 21: ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకుగాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. శనివారం తిరుమలలో టిటిడి పాలకమండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డికి ఆ సంస్థ భారత దేశ అధ్యక్ష్యులు శ్రీ సంతోష్ శుక్ల తరపున దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ అందజేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70 వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలోజరుగుతోందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు మూడున్నర లక్షలకు పైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారుచేసి భక్తులకు అందించడం జరుగుతోందన్నారు. కళ్యాణ కట్టలో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది భక్తులు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని
ఆయన తెలిపారు. ఇంత మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగం సేవలు అందిస్తోందని చెప్పారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదం లో పరిశుభ్రమైన వాతావరణం మధ్య స్వామివారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని శ్రీ సుబ్బా రెడ్డి చెప్పారు. రోజు ఇన్ని లక్షల మంది విచ్చేస్తున్న తిరుమల క్షేత్రం పరిశుభ్రత, పచ్చదనానికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఇతర ఏ ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన బుక్కులో తిరుమలకు చోటు కల్పించిందని ఆయన చెప్పారు.

టిటిడి లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరూ తాము దేవుడి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో కష్ట పడి పని చేస్తున్నందువల్లే టిటిడికి ఈ గుర్తింపు వచ్చిందని చైర్మన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు. సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది