Day-1 TEPPOTSAVAM ROLLS OUT AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ ఘనంగా శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం

Tirupati, 5 January 2020:  The TTD organised five day Teppotsavam (float festival) commenced grandly at Sri Kapileswara Swamy Temple on Sunday evening.

On day one of the five day event the Utsava idol of Vinayaka was taken out for five rounds in the Pushkarani. On day-2 Subramanyam idol will be taken on five rounds.

The colourfully decked float with floral and electrical decorations carrying utsava idols in the temple Pushkarani will be cynosure to devotees daily in the evenings. The TTD has rolled out cultural programs by artists of Annamacharya project every day.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi, Temple inspector Sri Reddy Sekhar, Archakas, other officials nets participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

ఘనంగా శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 05: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజులపాటు జరుగనున్న తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ  సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు కపిలతీర్థంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై మొదటిరోజు శ్రీవినాయకస్వామివారు ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించనున్నారు.

అదేవిధంగా సోమ‌వారం శ్రీ సుబ్రమణ్యస్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.