VAIKUNTHA DWARA DARSHANAM SAME AS IN PRACTICE NOW-CHAIRMAN _ వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం రోజుల్లో ఎలాంటి మార్పు లేదు జ‌న‌వ‌రి 20 నుండి శ్రీ‌వారిని ద‌ర్శించుకునే భ‌క్తులంద‌రికీ ఉచిత‌ ల‌డ్డూ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirumala, 5 January 2020: The TTD board has decided to continue the practice of Vaikunta dwara darshan for two days on Vaikunta Ekadasi and Vaikuntha Dwadasi, said TTD chairman Sri YV Subba Reddy.

After an emergency meeting of the board on Sunday evening he briefed media about important decisions taken the meet held at Annamaiah Bhavan Tirumala.

He said, that the board decided to follow status quo and there was no change in Vaikunta dwara darshan for devotees this year also.

The board decision came in wake of Public interest litigation on the duration of Vaikunta dwara darshan lodged by Sri Tallapaka Raghavan of Tirupati. The chairman said, the board also decided to form a committee under the convenor ship of Additional EO Sri A V Dharma Reddy to take a final stand on the issue in view of the high court direction soon.

Secondly the board also decided to provide one laddu free of cost from January 20 onwards to all devotees who had darshan of Lord Venkateswara. A detail of the exercise is being worked out. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం రోజుల్లో ఎలాంటి మార్పు లేదు

జ‌న‌వ‌రి 20 నుండి శ్రీ‌వారిని ద‌ర్శించుకునే భ‌క్తులంద‌రికీ ఉచిత‌ ల‌డ్డూ

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, 05 జ‌న‌వ‌రి 2020: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి సంద‌ర్భంగా రెండు రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించే విష‌యంలో ఎలాంటి మార్పు లేద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు అమ‌ల్లో ఉన్న సంప్ర‌దాయాన్నే కొన‌సాగిస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఆదివారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశం జ‌రిగింది.

 స‌మావేశం అనంత‌రం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ తిరుప‌తికి చెందిన శ్రీ తాళ్ల‌పాక రాఘ‌వ‌న్ వైకుంఠ ద్వారాన్ని ఎన్ని రోజులు తెరుస్తార‌నే విష‌య‌మై హైకోర్టులో పిల్ వేశార‌ని, దీనికి సంబంధించి జ‌న‌వ‌రి 6వ తేదీలోపు నిర్ణ‌యం తెలియ‌జేయాల్సిందిగా హైకోర్టు టిటిడిని కోరింద‌ని తెలిపారు. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిలో విస్తృతంగా చ‌ర్చించిన అనంత‌రం ఈ మేరకు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వివ‌రించారు. ఈ విష‌యాన్ని హైకోర్టుకు నివేదిస్తామ‌న్నారు. వైకుంఠ ఏకాద‌శికి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెర‌వాల‌నే అంశంపై అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి క‌న్వీన‌ర్‌గా ఒక క‌మిటీ ఏర్పాటు చేశామ‌ని, మ‌ఠాధిప‌తులు, పీఠాధితుల‌తో చ‌ర్చించి ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలియ‌జేశారు.

జ‌న‌వ‌రి 20వ తేదీ నుండి శ్రీ‌వారిని ద‌ర్శించుకునే భ‌క్తులంద‌రికీ ఉచిత‌ ల‌డ్డూ అంద‌జేస్తామ‌ని ఛైర్మ‌న్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టివ‌ర‌కు కాలిన‌డ‌క‌న వ‌చ్చే భ‌క్తుల‌కు మాత్ర‌మే టిటిడి ఉచితంగా ల‌డ్డూ అందిస్తోంద‌న్నారు.

మీడియా స‌మావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.