CHAKRASNANAM MARKS THE END OF ANNUAL BTUs AT APPALAYAGUNTA _ చక్రస్నానంతో ముగిసిన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

Appalayagunta, 10 Jun. 20: The annual brahmotsavams at Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta concluded on Wednesday.

Earlier, the processional deities of Sri Prasanna Venkateswara Swamy along with Sridevi and Bhudevi were given celestial Snapana Tirumanjanam with different aromatic ingredients. Later the Sudarshana Chakrattalwar was immersed in a Gangalam filled with water within the temple premises itself in view of COVID 19 restrictions.

Temple DyEO Smt Jhansi Rani, Agama Advisor Sri NAK Sundaravaradan, Chief Priest Sri Surya Kumar Acharyulu, Kankana Bhattar Sri Tippayya Acharyulu, Superintendent Sri Gopala Krishna Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చక్రస్నానంతో ముగిసిన  శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2020 జూన్ 10 : అప్ప‌లాయ‌ట‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆలయంలో బుధ‌వారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ముందుగా ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమెత  శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి  ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌న్‌, ఆలయ  ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, కంకణ భట్టార్ శ్రీ తిప్ప‌య్య ఆచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.