MAHA KUMBHABHISHEKAM HELD FOR CHENNAI PADMAVATHI TAYAR TEMPLE_ చెన్నెలో వేడుకగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహా కుంభాభిషేకం 

CHENNAITES ARE BLESSED_ VISAKHA PONTIFF

 

DEVOTEES THRONG IN LARGE NUMBERS

 

Chennai, 17 Mar 2023: The presiding deity of Tiruchanoor Sri Padmavathi Ammavaru has now appeared in the form of Sri Padmavathi Tayar in Chennai blessing the denizens, said HH Sri Swaroopanandendra Saraswati Maha Swamy of Visakha Sarada Peetham.

 

The Pontiff graced for the Maha Kumbhabhishekam of Sri Padmavathi Tayar temple in GN Chetti Road at Chennai on Friday.

 

During his Anugraha Bhashanam on the auspicious occasion the Pontiff said though the world-renowned Hindu religious shrines of Sri Padmavathi Venkateswara are stationed at Tirupati district of Andhra Pradesh, the deities are much worshipped by the denizens of Tamilnadu. With the benign blessings of the deities may prosperity blossom in the lives of the people of Tamilnadu, he wished.

 

TTD Chairman Sri YV Subba Reddy in his address said after Tiruchanoor temple, an exclusive temple for Goddess Sri Padmavathi Devi has now become a reality only in Chennai in the entire country. He lauded the largesse of veteran actress Ms. Kanchana and her family who donated land towards the construction of Sri Padmavathi Tayar temple and the contribution of Chennai Local Advisory Committee Chief Sri Sekhar Reddy.

 

Later Sri Sekhar Reddy also said he was fortunate enough to be a part in this divine contribution.

 

Devotees thronged in huge numbers to have darshan of Goddess Padmavathi Devi which was provided after Maha Kumbhabhishekam.

 

TTD Board member Dr Shankar, Delhi LAC Chief Smt Prasanthi, JEO Sri Veerabrahmam, Agama Advisor Sri Srinivasacharyulu, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and other officials of TTD were present.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చెన్నై వాసులు అదృష్టవంతులు

విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి

– చెన్నెలో వేడుకగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహా కుంభాభిషేకం

-పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు

తిరుపతి 17 మార్చి 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు చెన్నై నగరవాసులను ఆశీర్వదించడానికి ఇక్కడ కొలువుదీరారని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి సంతోషం వ్యక్తం చేశారు. అమ్మఆశీస్సులు పొందుతున్న చెన్నై వాసులు అదృష్టవంతులని స్వామి చెప్పారు.

చెన్నై జిఎన్ చెట్టి వీధిలో టీటీడీ నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహాకుంభాభిషేకం శుక్రవారం శాస్త్రోక్తంగా,అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శారదా పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి,చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్ష్యులు శ్రీ శేఖర్ రెడ్డి కృషితో అమ్మవారి ఆలయం అద్భుతంగా నిర్మించారని అన్నారు. ఆలయ నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన సినీనటి కాంచన,వారి కుటుంబ సభ్యులు అదృష్టవంతులని, వారికి శ్రీ వేంకటేశ్వరస్వామి,శ్రీపద్మావతి దేవి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. స్వామివారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా తమిళులు తమ సొంతదైవంగా భావిస్తారని స్వామి చెప్పారు. తమిళ నాడులో శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. మురుగన్ , శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో తమిళనాడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. దేశంలోని జ్యోతిర్లింగాలు,అష్టాదశ శక్తి పీఠాల్లో కెల్లా తిరుమల శ్రీవారు గొప్ప దేవుడని స్వామి కొనియాడారు. ప్రపంచంలో వేదాలు ఇంకా బతికి ఉన్నాయంటే అది శ్రీవేంకటేశ్వర స్వామి దయేనని, స్వామి వేద పరిరక్షకుడని చెప్పారు.

అంతకు ముందు టీటీడీ చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, దేశంలో తిరుచానూరు తరువాత శ్రీ పద్మావతి అమ్మవారు చెన్నై నగరంలోనే కొలువుదీరారని చెప్పారు. స్థలదాత సినీనటి కాంచన వారి కుటుంబసభ్యులు, టీటీడీ స్థానిక సలహామండలి అధ్యక్ష్యులు శ్రీ శేఖర్ రెడ్డి సభ్యుల సహకారంతో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం అద్భుతంగా నిర్మించినట్లు ఆయన తెలిపారు. శ్రీశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆలయ నిర్మాణంలో తాము పాలుపంచుకోవడం అదృష్టమన్నారు.

మహా కుంభాభిషేకం అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.

టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ శంకర్, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహామండలి చైర్పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవో శ్రీవీరబ్రహ్మం, ఆగమ సలహాదారు శ్రీశ్రీనివాసాచార్యులు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్,చీఫ్ ఇంజినీర్ శ్రీనాగేశ్వరరావు, ఎస్ఈ లు శ్రీసత్యనారాయణ,శ్రీవెంకటేశ్వర్లు, డిప్యూటి ఈవో శ్రీ విజయ కుమార్ , టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాలరావు, విజివో శ్రీమనోహర్, ఈఈ శ్రీమనోహర్ తో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది