MAHA KUMBHABHISHEKAM FOR CHENNAI PADMAVATHI TEMPLE OBSERVED _ చెన్నైలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు

VEDIC RITUALS HELD

TIRUPATI, 17 MARCH 2023: The Maha Kumbhabhishekam for Sri Padmavathi Tayar temple that has come up in GN Chetti road at Chennai was observed with religious grandeur.

The day on Friday began with a series of Vedic rituals Vishwaksena Aradhana, Chatustanarchana, Bali Harana, Gosti, Brahma Ghosha, Veda Sattumora, Maha Purnahuti, Prayaschitta Homams, Shanti Homams and Purnahuti followed by Kumbha Udhwasana, Kumbha Samprokshana, Vimana and Rajagopura Kumbha Prokshana rituals between 4am and 12noon.

Later Sri Padmavathi Srinivasa Kalyanam was held with spiritual fervour witnessed by hundreds of devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చెన్నైలో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహాకుంభాభిషేకం

– శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు

తిరుప‌తి, 2023 మార్చి 17: చెన్నైలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విశ్వక్సేనారాధన, చతుష్టార్చన, బలిహరణ, గోష్టి, బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, మహా పూర్ణాహుతి, ప్రాయశ్చిత్త హోమాలు, శాంతిహోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కుంభ ఉద్వాసన, కుంభ ప్రోక్షణ, విమాన, రాజగోపురానికి కుంభ ప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట, హారతి జరిగింది.

అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. తరువాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.