ANNAMAYYA SAPTAGIRI GOSTI GANAM IN TIRUMALA _ మార్చి 18న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం

TIRUMALA, 17 MARCH 2023: On the occasion of 520th Death Anniversary of Saint Poet Sri Tallapaka Annamacharya, Saptagiri Gosti Ganam will be observed in Tirumala on March 18.

 

The artistes of Annamacharya Project will present the Sankeertans in front Sri Bhu Sameta Sri Malayappa Swamy who graces Narayanagiri Gardens on Saturday evening after Sahasra Deepalankara Seva.

 

The 46th Pontiff of Ahobila Mutt will render Anugraha Bhashanam on the occasion.

 

The successors of Annamacharya will be felicitated on the occasion.

 

Bhajana teams and devotees also participate.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 18న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం
 
తిరుమల, 2023 మార్చి 17: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 520వ వర్ధంతిని పురస్కరించుకుని మార్చి 18వ తేదీ శనివారం తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం జరుగనుంది. శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. 
 
శ్రీ అన్నమాచార్య గురుపరంపరకు చెందిన శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీ విచ్చేస్తారు. ఈ సందర్భంగా తాళ్లపాక వంశీయులను సన్మానిస్తారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు, భజన బృందాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.