AP GUV, CM AND VISAKHA SEER TO TAKE PART IN MAHA SAMPROKSHANAM OF AMARAVATI SV TEMPLE _ జూన్ 9న అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు విస్తృత ఏర్పాట్లు

CHAIRMAN AND EO INSPECTS THE ARRANGEMENTS

 Amaravati, 06 JUNE 2022: As the Prana Pratistha and Mahasamprokshanam of Sri Venkateswara temple in Amaravati is scheduled on June 9 in the auspicious Mithuna Lagnam between 7.30am and 8.30am TTD Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy along with JEO Sri Veerabrahmam inspected the ongoing arrangements for the big fete on Monday. 

Speaking to the media, the TTD Chairman said, the Honourable Governor of AP Sri Biswabhushan Harichandan, CM of AP Sri YS Jaganmohan Reddy and HH Sri Swarupandendra Saraswathi Mahaswamy of Visakha Sarada Peetham will be participating in the Maha Samprokshana rituals on June 9. TTD has constructed this temple of Sri Venkateswara Swamy within two years at Rs.40crores. “Though TTD has constructed many other SV temples in other capital cities also, the one in Amaravati is the mega one and we are very much keen to develop green scapes surrounding the temple, which is located in a sprawling 25acres of land. 

The Chairman also said, the devotees will be allowed for darshan of the presiding deity of Sri Venkateswara Swamy after the Vigraha Pratista and Maha Samprokshanam rituals are completed, from the same day onwards. He said, TTD will also negotiate with RTC officials to make necessary arrangements of transportation for the sake of local devotees.

TTD Chief Engineer Sri Nageswara Rao, DyEO Sri Gunabhushan Reddy, All Projects Program Officer Sri Vijaya Saradhi, VGO Sri Manohar, AEO Sri Dorasami Naik and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 9న అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు విస్తృత ఏర్పాట్లు

– విచ్చేయ‌నున్న గౌ. గ‌వ‌ర్న‌ర్‌, గౌ. ముఖ్య‌మంత్రివ‌ర్యులు, శార‌ద పీఠాధిప‌తి

– ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

అమ‌రావ‌తి, 2022 జూన్ 06: అమ‌రావ‌తిలో నిర్మించిన‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో జూన్ 9న ఉద‌యం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు మిథున ల‌గ్నంలో ప్రాణ ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుందని, ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంతో క‌లిసి సోమవారం ఛైర్మ‌న్ ఇక్క‌డి ఆల‌యంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్ గౌ. శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్, ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర స్వామివారు విచ్చేస్తార‌ని అన్నారు. ఇటీవ‌ల ప‌లు రాష్ట్రాల రాజ‌ధాని న‌గ‌రాల్లో నిర్మించిన ఆల‌యాల కంటే ఇక్క‌డి ఆల‌యం చాలా పెద్ద‌ద‌ని, సుమారు రూ.40 కోట్ల వ్య‌యంతో నిర్మించామ‌ని వెల్ల‌డించారు. ఇక్క‌డ 25 ఎక‌రాల స్థ‌లం ఉంద‌ని, ప‌చ్చ‌ద‌నం పెంచ‌డంతో పాటు ఆల‌యాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. అర్టీసీ అధికారుల‌తో చ‌ర్చించి చుట్టుప‌క్క‌ల ఉన్న వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తుల‌కు ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవో శ్రీ గుణ‌భూష‌ణ్‌రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, విజిఓ శ్రీ మనోహర్, ఎఈవో శ్రీ దొరస్వామి నాయక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.