Rs.10Cr DONATED TO TTD TRUSTS ON A SINGLE DAY _ రికార్డు స్థాయిలో ఒకే రోజున టీటీడీ ట్రస్ట్‌లకు రూ.10 కోట్లు విరాళం
NEW RECORD SET
A TN DEVOTEE DONATES Rs.7Cr TO VARIOUS TRUSTS
TIRUMALA, 06 JUNE 2022: In a record of its sorts, TTD received Rs.10Cr as a donation to various trusts from different individuals and Firms on a single day.
Sri Gopal Bala Krishnan from Tirunelveli of Tamil Nadu, an ardent devotee of Srivaru alone has donated Rs. Seven crores with one crore each to Sri Venkateswara Pranadana Trust, Sri Venkateswara Gosamrakshana Trust Balaji Institute of Surgery Research and Rehabilitation for the Disabled (BIRRD) – Sri Venkateswara Veda Parirakshana Trust, Sri Venkateswara Anna Prasadam Trust Sri Venkateswara Sarva Sreyas Trust – and to Sri Venkateswara Bhakti Channel (SVBC).
On the other hand M/S A-Star Testing & Inspection PVT.LTD, Tirunelveli, Tamil Nadu have donated Rs. One crore to Sri Venkateswara Vidyadana Trust while Balakrishna Fuel Station also from Tirunelveli, Tamil Nadu has donated Rs. One Crore to Sri Venkateswara Alayala Nirmanam Trust – and SEA- HUB INSPECTION SERVICES, Tirunelveli, Tamil Nadu has donated Rs. One crore to Sri Venkateswara Heritage Preservation Trust of TTD.
The donors handed over all the DDs to TTD EO Sri AV Dharma Reddy at his camp office in Tirumala on Sunday night.
Deputy EO Donor Cell Smt Padmavathi was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రికార్డు స్థాయిలో ఒకే రోజున టీటీడీ ట్రస్ట్‌లకు రూ.10 కోట్లు విరాళం
– తమిళనాడుకు చెందిన ఒకే భక్తుడు వివిధ ట్రస్ట్‌లకు రూ.7 కోట్లు విరాళం
తిరుమల, 2022 జూన్ 06: టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో ఒకే రోజు వివిధ వ్యక్తులు మరియు సంస్థల నుండి టీటీడీలోని ట్రస్ట్‌లకు రూ.10 కోట్లు విరాళంగా అందింది.
తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన శ్రీ గోపాల్ బాల కృష్ణన్ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్, బర్డ్ ట్రస్ట్, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్, ఎస్వీ సర్వ శ్రేయస్ ట్రస్ట్ మరియు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు ఒక్కొక్కదానికి కోటి చొప్పున ఏడు కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.
అదేవిధంగా తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన ఎ-స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్‌స్పెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు కోటి రూపాయలు, బాలకృష్ణ ఇంధన కేంద్రం సంస్థవారు శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్‌కు రూ.కోటి, సీ-హబ్ ఇన్‌స్పెక్షన్ సర్వీసెస్ సంస్థ ఎస్వీ హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు.
ఆదివారం రాత్రి తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డికి దాతలు సంబంధిత డీడీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో (డోనర్ సెల్) శ్రీమతి పద్మావతి కూడా పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.