TTD ROLLS OUT FULL STEAM STEPS FOR V DAY _ జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న వైకుంఠ ద్వాద‌శికి ఏర్పాట్లు పూర్తి

Tirumala, 5 January 2020: TTD has made elaborate arrangements for grand V Day celebrations at the Srivari temple beginning on Monday, January 6.

TTD has made foolproof arrangements for Vaikunta dwaram darshan to devotees from 0200 hours after Dhanur masam rituals; Sarva darshan for common devotees is scheduled at 0500 sharp.

SWARNA RATHAM

As Vaikunta dwaram darshan. Continued inside the Srivari temple, the TTD has organised Swarna Ratham procession on mada streets of utsava idols of Sri Malayappaswamy and his consorts. Again in the evening Sahasra dipalankara seva and Tiruchi procession thereafter. There will be Andhyayanotsava programs at the Ranganayakula mandapam from 8.30-9.30 pm.

CHAKRASNANAM ON JAN 7

The highlight of the events at Tirumala on Vaikunta dwadasi is the Pushkarani thirtha mukkoti wherein the Sri Chakrathalwar is led to chakrasnanam in the Pushkarani after procession on mada streets.

TTD has cancelled all arjita sevas which includes Kalyanotsavam, Unjal seva, arjita Brahmotsavams, Vasantotsavam etc. from January 5-7 I. View of V Day celebrations.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న వైకుంఠ ద్వాద‌శికి ఏర్పాట్లు పూర్తి

తిరుమల, 05 జ‌న‌వ‌రి 2020: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాలకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 6న తెల్లవారుజామున 12.30 నుండి 2 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వహిస్తారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఉద‌యం 9 గంట‌ల‌కు స్వ‌ర్ణ‌ర‌థం..

ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ కన్నులపండుగగా జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో క‌లిసి తిరుచ్చిపై నాలుగుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

జ‌న‌వ‌రి 7న చ‌క్ర‌స్నానం

జ‌న‌వ‌రి 7వ తేదీన‌ వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి తిరుమలలో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీ చక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గ‌ల‌ స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత‌సేవ‌ల‌ను టిటిడి రద్దు చేసింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.