72ND REPUBLIC DAY OBSERVED WITH PATRIOTIC FERVOUR IN TIRUPATI _ టిటిడి పరిపాలనా భవనంలో మువ్వ‌న్నెల జెండా రెపరెపలు

OFFERING INCREDIBLE SERVICES TO PILGRIMS IS OUR PRIORITY-TTD EO

 R-DAY PARADE REMAINS A VISUAL TREAT

 MERIT CERTIFICATES GIVEN TO 281 EMPLOYEES OF TTD

Tirupati, 26 Jan. 21: Inspite of Covid lockdown, TTD has overcome the crisis with the team efforts of the strong work force of TTD and even the nitya kainkaryams have continued in Ekantam without deviation of Agama Sastra with the dedication religious staffs under the supervision of Tirumala Jeeyangar Swamijis and the institution won the accolades for this team effort, said TTD EO Dr KS Jawahar Reddy.

After hoisting the National Flag on the occasion of 72nd Republic Day celebrations at Parade Grounds behind TTD Administrative Building on Tuesday in Tirupati, in his address, EO thanked all religious, workforce, sanitation workers, volunteers and above pilgrims for their support even during the high time.

He said, Srivari Darshan resumed from June 11 onwards for pilgrims after initiating health safety measures as per Covid-19 guidelines of state/central governments for both Devotees and TTD staff.  TTD provided comfortable Srivari Darshan to devotees and won worldwide accolades from dignitaries and devotees.  

The EO said after consulting 26 Peethadhipathis, TTD has successfully organised 10 day Vaikunta dwara Darshan for devotees from December 25 till January 3 for the first time providing a cheerful darshan to 4.26lakh pilgrims. Pursuing Covid guidelines, only ticket holders will be allowed at Alipiri for Radhasapthami, which is scheduled on February 19, he added.

Under the directives of AP CM to promote sanatana Hindu Dharma TTD has launched the Gudiko Gomata program of donating a pair of Cow and calf to temples across the nation from holy Karthika month last year. Subsequently cow and calf program was launched at Sri Kanaka Durga temple of Vijayawada and thereafter in Karnataka, Telangana states and soon will be commenced in Tamilnadu.

EO also made a brief note of various spiritual and dharmic programmes taken up by TTD including Sundarakanada Deeksha, Gita Parayanam, Virataparvam, Karthikamasa Deeksha, Dhanurmasa Deeksha etc.taken up by TTD since lockdown period and said the programmes will continue to instil the spiritual fervour among people and especially the youth to aquire courage to overcome all the problems, he added.

The EO also mentioned about various Srivari temple constructions which have completed, under way and being contemplated at Hyderabad, Vizag, Jammu and Kashmir etc. He said Tirumala is also going to get a make over with more greenery, plastic free, pollution free environment soon. The EO said various development activities are underway at Tirumala including repairs of rest houses, beautification of gardens, SV Museum, etc.

PARADE FEAT

The parade feat performance by NCC Cadets, Horses stood as cynosure during the entire event. The R-Day parade reminded of the one at Redfort in Country’s capital. 

MERIT CERTIFICATES

For the services offered by the employees, Merit Certificates were given to 38 Senior Officers and 243 employees of various departments in TTD by EO and other top brass officials.

TTD Additional EO Sri AV Dharma Reddy, JEOs Sri P Basanth Kumar, Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, FACAO Sri Balaji, CE Sri Ramesh Reddy, DLO Sri Reddeppa Reddy, Additional CVSO Sri Venkata Siva Reddy, CAO Sri Sesha Sailendra, GM Transport Sri Sesha Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

టిటిడిలో ఘనంగా  గణతంత్ర దినోత్సవ వేడుకలు

తిరుపతి, 2021 జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ప్రాంగణంలోని మైదానంలో  మంగ‌ళ‌వారం ఘనంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా టిటిడి కార్య‌నిర్వ‌హ‌ణాధికారి డాక్ట‌ర్.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఉద్యోగుల‌ను ఉద్దేశించి ప్రసంగించారు.  వివ‌రాలు వారి మాటల్లోనే….

ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంత సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు 72వ గణతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఎందరో యోధుల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడిగా నిలిచాడు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర పర్వదినం రోజున టిటిడి భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

శ్రీవారి ఆలయం :  

–      టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం.

–      కోవిడ్‌-19 నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర టిటిడి ఆలయాలలో బ్రహ్మూెత్సవాలను ఏకాంతంగా నిర్వహించాం. కోవిడ్‌ పరిస్థితుల్లో తమవంతు సాయంగా తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, రెండో సతం, తిరుచానూరులోని పద్మావతి నిలయంలో రోగులకు వసతి కల్పించాం. క్లిష్టసమయంలో భక్తులకు, రోగులకు ఆపన్నహస్తం అందించాం.

శ్రీవారి దర్శనం

– ఉద్యోగులు, భక్తుల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కోవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. తితిదే నిబంధనలు పాటిస్తూ సంతృప్తికరంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్న భక్తులను అభినందిస్తున్నాము.

– వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల సాంప్రదాయాలను పునరుద్ధరింపచేస్తూ శ్రీమాన్‌ పెద్దజీయంగార్లు, ఆగమసలహాదారులు మరియు 26 మంది పీఠాధిపతులు మరియు మఠాధిపతులను సంప్రదించి వారి అభిప్రాయం మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలో మొట్టమొదటిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 4.26 లక్షల మంది భక్తులను దర్శనభాగ్యం కల్పించాం. మొట్టమొదటిసారిగా 3 లక్షల మంది సామాన్య భక్తులకు ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ ద్వారా ఎలాంటి సిఫార్సులు లేకుండా టోకెన్లు జారీచేసి 10 రోజులలో వైకుంఠద్వార దర్శనభాగ్యం కల్పించాం. దాతలకు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించడం కూడా ఇదే మొదటిసారి.

– ఫిబ్రవరి 19న రథసప్తమి సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో స్వామివారి వాహనసేవలు నిర్వహిస్తాం. యథాప్రకారం దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తాం.

– ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నాం. ఈ ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించిన దాతలకు ఒకసారి విఐపి బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నాం. ఈ ట్రస్టుకు రూ.100 కోట్ల పైగా విరాళాలు అందాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

శ్రీ వరాహస్వామివారి ఆలయ బాలాలయ సంప్రోక్షణ

– డిసెంబరు 6 నుండి 10వ తేదీ వరకు తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించాం. శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు కవచ సమర్పణ జరిగిన తరువాత మహాసంప్రోక్షణ వరకు బాలాలయంలో స్వామివారికి నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం.

వసతి :

– శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం వసతి సముదాయాల్లోని గదులను డిసెంబరు 15వ తేదీ నుంచి భక్తులకు కేటాయిస్తున్నాం. అలాగే తిరుమలలో కాటేజీల్లో జరుగుతున్న మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం.

ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు  :

–  ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో హిందూ ధర్మాన్ని విస్త త ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించాం. పవిత్ర కార్తీక మాసంలో డిసెంబరు 7న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ, కర్ణాటక, రాష్ట్రాలతోపాటు ఉత్తరాదిలోని ఢిల్లీలో కూడా శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఆవు, దూడ అందించి ఆ రాష్ట్రాల్లో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించాం. త్వరలో తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం.

– దేశంలో భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి టిటిడి సిద్ధంగా ఉంది. దేశంలోని ఆలయాలు, పీఠాలు, వేద పాఠశాలలు ముందుకొస్తే టిటిడి గోవును అందిస్తుంది.

– తితిదేలో మొట్టమొదటిసారిగా తిరుమల ధర్మగిరి మరియు వసంతమండపంలో 16 రోజుల పాటు షోడశ దిన సుందరకాండ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించి, ఎస్వీబీసీలో ప్రసారం చేసి కోట్లాది మంది భక్తులను ఈ దీక్షా కార్యక్రమంలో భాగస్వాములుగా చేశాం.

–     ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేయాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ కార్తీక మాసంలో నెల రోజుల పాటు తిరుమల వసంత మండపంలో అశ్వత్థ పూజ, సాలగ్రామ పూజ, రాధా దామోదర వ్రతం, తులసీ ధాత్రీ దామోదర వ్రతం, గోపూజ, విష్ణుపూజలు, వ్రతాలు నిర్వహించాం. ప్రతిరోజూ కార్తీక పురాణ ప్రవచన కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాం.

– తిరుపతి కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో 14 రోజుల పాటు శివపూజలు, త్రిలోచన గౌరీ వ్రతం, స్కంద షష్టి, నాగులచవితి, సంకష్టహర గణపతి వ్రతం, శివ సోమవార వ్రతాలు నిర్వహించాం.

–     తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల ధ్యానారామంలో రుద్రాభిషేకం చేపట్టాం.

–     నవంబరు 30వ తేదీన తిరుపతిలో కార్తీక మహా దీపోత్సవం, డిసెంబరు 11న విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం నిర్వహించాం.

–    తిరుమలలో శ్రీమాన్‌ పెద్దజీయంగార్‌ వారి సమక్షంలో, వారి మఠంలో ధనుర్మాసం 30 రోజులు కూడా ఆండాళ్‌ తిరుప్పావై పాశురాలను గానం చేస్తూ, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది భక్తులతో ఈ పాశురాలను పలికించి తెలుగులో వాటి తాత్పర్యాన్ని ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేశాం.

–     ధనుర్మాస కార్యక్రమాల్లో భాగంగా విష్ణు అవతార వైభవ ప్రవచనాలు, గో, వృషభ పూజ, గోపికా పూజలతో పాటు తిరుప్పావై పాశుర పఠనం నిర్వహించాం. అలాగే జనవరి 8న కర్నూలులో ధనుర్మాస లక్ష్మీ దీపారాధన, జనవరి 14న తిరుపతిలో గోదా కల్యాణం, జనవరి 15న నరసారావుపేటలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గారి చేతులమీదుగా కామధేను పూజ నిర్వహించాం.

–      ప్రపంచమానవాళికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం, విరాటపర్వం పారాయణం, గీతాపారాయణం కార్యక్రమాలకు భక్తుల ప్రశంసలు అందుతున్నాయి. వీటిని ఆదరిస్తున్న భక్తులకు క తజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హైందవ సాంప్రదాయాల పట్ల, సనాతన ధర్మం పట్ల, ఆర్ష గ్రంథాల ద్వారా ఋషులు మనకందించిన అపారమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను యువత నిర్లక్ష్యం వహిస్తున్న తరుణంలో, వాటిని పునరుద్ధరింపజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయా మాసానికి సంబంధించిన విశేష కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహించి ఎస్వీబీసీ ద్వారా ప్రసారం చేయాలని టిటిడి సంకల్పిస్తోంది.

పవిత్ర ఉద్యానవనాలు :

–    పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో తిరుమలలో శిలా తోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం, గోగర్భం డ్యామ్‌ వద్ద 25 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర శ్రీగంధపు పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేస్తున్నాం. రెండు ప్రాంతాల్లో కలిపి 35 ఎకరాల్లో 16 వేల మొక్కలు పెంచుతున్నాం.

తిరుమల సుందరీకరణ :

–    దాతల సహకారంతో తిరుమలలో ఉద్యానవనాలను అభివృద్ధి చేసి అన్ని కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దుతాం.

ఎలక్ట్రిక్‌ బస్సులు :

–    తిరుమలను ప్రపంచంలోనే అద్భుతమైన పర్యావరణ ఆధ్యాత్మిక కేంద్రంగా(హోలి గ్రీన్‌ సిటి) మార్చడంలో భాగంగా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల నిషేధాన్ని సంపూర్ణంగా అమలుచేస్తున్నాం. మరో అడుగు ముందుకేసి పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమలకు 100 నుంచి 150 ఎలక్ట్రికల్‌ బస్సులను ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రికి విన్నవించాం.

–    భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మరియు తిరుమలను ప్లాస్టిక్‌ రహిత ప్రదేశంగా  మార్చాలనే ఉద్దేశంతో ప్రస్తుతం లడ్డూల పంపిణీకి వాడుతున్న ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో 40 మైక్రానుల బయో కంపోస్టబుల్‌ సంచులు తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా, ప్లాస్టిక్‌ సంచుల స్థానంలో  అంతర భాగంలో బట్టర్‌ కాగితం ఉన్న బట్టసంచులు వినియోగించాలని నిర్ణయించడం జరిగింది. త్వరలో వీటిని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం.

గ్రీన్‌పవర్ :

–     తిరుమల పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్‌పవర్‌(సౌర, పవన విద్యుత్‌) వినియోగానికి నిర్ణయం తీసుకున్నాం.

పంచగవ్య ఉత్పత్తులు :

–     పంచగవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రంతో పలు ఉత్పత్తులను తయారుచేసి ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇందుకు సంబంధించి దేశంలోని పేరుగాంచిన సంస్థల సహకారం తీసుకుంటున్నాం.

బర్డ్‌ :

–     వికలాంగులకు ఉపయోగకరంగా ఉండేలా తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రిలో డిసెంబరు 3న దేశంలోనే తొలి బయోనిక్‌ హ్యాండ్‌ను ఆవిష్కరించాం. ముఖ్యమంత్రివర్యుల ఆదేశం మేరకు క త్రిమ అవయవాల తయారీలోను, వికలాంగులకు శిక్షణలోను దేశంలో నెంబర్‌1 ఆసుపత్రిగా బర్డ్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

నిఘా మరియు భద్రత :

–     తిరుమలలో మూడో దశలో రూ.20 కోట్లతో 1300 సిసి కెమెరాల ఏర్పాటుకు సర్వే జరుగుతోంది.

శ్రీవారి ఆలయాల నిర్మాణం :  

–     విశాఖపట్నంలో రూ.29 కోట్లతో నిర్మించిన శ్రీవారి ఆలయానికి త్వరలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తాం.

–     ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరంలో రూ.13.50కోట్లతో శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

–     రూ.6.7 కోట్లతో భువనేశ్వర్‌లో పూర్తి కానున్న శ్రీవారి ఆలయ నిర్మాణానికి త్వరలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తాం. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి త్వరలో శంఖుస్థాపన చేస్తాం. వారణాశిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భూమి కేటాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. అదేవిధంగా, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమైనది.

అభివృద్ధి పనులు :

–      ఎస్వీ బదిర పాఠశాల మరియు జూనియర్‌ కళాశాల విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో భాగంగా జూపార్కు సమీపంలో రూ.34.50 కోట్లతో హాస్టల్‌ భవనం, రూ.14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థ హాస్టల్‌ భవనాల నిర్మాణానికి బోర్డు నిర్ణయం తీసుకుంది.

–     అలిపిరి కాలినడక మార్గంలో రిలయన్స్‌ సంస్థ సహకారంతో రూ.25 కోట్లతో చేపట్టిన పైకప్పు పునర్నిర్మాణ పనులను ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

–      అలిపిరి – చెర్లోపల్లి రోడ్డు విస్తరణలో మిగిలివున్న పనులు రూ.16 కోట్లతో జరుగుతున్నాయి.

–      పరకామణి ప్రక్రియను భక్తులు వీక్షించే రీతిలో అద్దాలను అమరుస్తూ రూ.8.90 కోట్లతో పరకామణి భవన నిర్మాణాన్ని, అలాగే పోటు కార్మికులకు అధునాతనమైన సౌకర్యాలను కల్పిస్తూ రూ.15 కోట్లతో బూందీ భవనానికి సుందరీకరణ పనులు చేపట్టాం. దాతల సహకారంతో చేపడుతున్న ఈ పనులు 6 నెలల్లో పూర్తవుతాయి.

–     మ్యాప్‌ సిస్టం వారి సహాయ సహకారాలతో తిరుమల ఎస్వీ మ్యూజియంలో స్వామివారి ఆలయ దర్శన అనుభూతిని కల్పించేరీతిలో టెంపుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ గ్యాలరీలను నిర్మిస్తున్నాం. అలాగే, టాటా మరియు టెక్‌ మహీంద్రా సంస్థల సహాయ సహకారాలతో మ్యూజియం మొదటి, రెండు, మూడో అంతస్తుల్లో మన కళాఖండాలు ఉట్టిపడేరీతిలో, అలాగే శ్రీవారి అనేకమైన ఆభరణాల నమూనాలను భక్తులకు ప్రత్యక్షవీక్షణానుభూతిని కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము.

–     తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కొరకు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను కొత్త టెక్నాలజితో అభివ ద్ధి చేయాలని నిర్ణయించాం. బయోడిగ్రేడబుల్‌ తడి చెత్త నుండి వచ్చే సేంద్రియ ఎరువును విక్రయించడానికి లైసెన్స్‌ తీసుకున్నాం.

హిందూ ధర్మ ప్రచారం :

–     హిందూ ధర్మప్రచార పరిషత్‌ ద్వారా మనగుడి, శుభప్రదం, శ్రీనివాస కల్యాణాలు, అర్చక శిక్షణ, సదాచారం, సనాతన ధార్మిక పరీక్షలు లాంటి  కార్యక్రమాల ద్వారా సనాతన హైందన ధర్మ ప్రచారం చేస్తున్నాం.

–      ధర్మప్రచారంలో భాగంగా సమరసత ఫౌండేషన్‌ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాల నిర్మాణం పూర్తి చేశాం. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరో 500 ఆలయాలను ఆ సంస్థ సహకారంతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.  

–     రాష్ట్రంలోని దేవాదాయశాఖ, టిటిడి, వివిధ ధార్మిక సంస్థలు నిర్వహిస్తున్న వేద పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, వేద విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో కామన్‌ సిలబస్‌ తయారుచేసి సంహిత (10వ తరగతి), మూలము (ఇంటర్‌మీడియేట్‌) పరీక్షలు నిర్వహించి ఒకే సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.

మాఘ మాస కార్యక్రమాలు :

–     రాష్ట్రం విద్యావిధానంలో అభివృద్ధి సాధించాలని, విద్యార్థులకు జ్ఞానాభివృద్ధి కలగాలనే సదుద్దేశంతో ఫిబ్రవరి 16న నెల్లూరులో సరస్వతిపూజ నిర్వహించాలని సంకల్పించాం.

అన్నమయ్య సంకీర్తనల పరిష్కరణ:

–      పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య రచించిన సంకీర్తనల్లో ఇంకా మిగిలిపోయిన వాటిని త్వరితగతిన పరిష్కరించి, రికార్డు చేసి భక్తజన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అన్నమాచార్య సంకీర్తనలకు అర్థతాత్పర్యాలపై లోతైన విశ్లేషణ గావించి భక్తులకు అందుబాటులో ఉంచాలని కృషి చేస్తున్నాం.

దాతలకు ధన్యవాదాలు :

–     టిటిడి నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు చాలామంది దాతలు విరివిగా విరాళాలిస్తున్నారు. వీరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

టిటిడి ఉద్యోగులు :

–      సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్లస్థలాల సమస్యపై ఉద్యోగులతో తరచూ సమావేశాలు నిర్వహించి సానుకూల చర్యలు తీసుకుంటున్నాం.

–      కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల్లో మనోధైర్యం పెంచుతున్నాం. కోవిడ్‌ బారిన పడిన వారికి ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నాం.

–     కలియుగ వేంకటేశ్వరుడు యావత్‌ ప్రపంచానికి ఆరోగ్యం, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

 –      మానవసేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని పరమావధిగా పాటిస్తూ గత ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా తిరుమల తిరుపతి దేవస్థానం దేశవిదేశాల నుండి వచ్చే శ్రీవారి భక్తుల సేవలో తరిస్తున్నది. స్వామివారి కృపతో ఇది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ధర్మో రక్షతి రక్షిత: అనే వేదోక్తిని పాటిస్తూ సనాతన హైందవధర్మ ప్రచారానికి, వేదవిద్య వ్యాప్తికి టిటిడి ఎళ్లవేళలా కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను.

కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో లు బసంత్ కుమార్, శ్రీమతి సదా భార్గవి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, సి ఈ శ్రీ రమేష్ రెడ్డి,ఎఫ్ ఏ అండ్ సి ఏ ఓ శ్రీ బాలాజి, డి ఎల్ ఓ శ్రీ రెడ్డెప్ప రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి పరిపాలనా భవనంలో మువ్వ‌న్నెల జెండా రెపరెపలు

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు మంగ‌ళ‌వారం  ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.

ఈ సందర్భంగా టిటిడి భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీగంగ‌రాజు పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. టిటిడి భ‌ద్ర‌తా సిబ్బంది క‌వాతులో విశ్రాంత‌ సైనిక ద‌ళానికి శ్రీ పి.మ‌నోహ‌ర్‌, శ్రీ‌వారి భ‌ద్ర‌త‌(రెడ్ ష‌ర్ట్స్‌) సిబ్బందికి శ్రీ రాజేష్‌‌, సెక్యూరిటీ గార్డు సిబ్బందికి శ్రీ రామ‌కృష్ణ‌, ఎస్‌పిఎఫ్ సిబ్బందికి శ్రీ కె.భార్గ‌వ్‌, ఖాకీ షర్ట్స్ సిబ్బందికి శ్రీ బి.శ‌శికుమార్‌, మ‌హిళా సెక్యూరిటీ సిబ్బందికి  కుమారి జి.కోమ‌ల నాయ‌క‌త్వం వ‌హించారు. బ్యాండ్ మాస్ట‌ర్‌గా శ్రీ బి.బ‌స‌వ‌య్య వ్య‌వ‌హ‌రించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.