PARADE FEAT _ టిటిడి పరిపాలనా భవనం ప‌రేడ్ మైదానంలో ఆకట్టుకున్న అశ్వ ప్రదర్శన

Tirupati, 26 Jan. 21: The parade feat performance by NCC Cadets, Horses stood as cynosure during the entire event. The R-Day parade reminded of the one at Redfort in Country’s capital. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

టిటిడి పరిపాలనా భవనం ప‌రేడ్ మైదానంలో ఆకట్టుకున్న అశ్వ ప్రదర్శన

తిరుపతి, 2021 జ‌న‌వ‌రి 26: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ప‌రేడ్ మైదానంలో  మంగ‌ళ‌వారం జరిగిన భారత గ‌ణ‌తంత్ర‌ వేడుకల్లో టిటిడి ఎస్వీ ఆ‌ర్ట్స్ ళాశాలల ఎన్‌సిసి విద్యార్థిని విద్యార్థులు అశ్వాలతో ప్రదర్శించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తిరుప‌తి 2(ఎ) రెజిమేంట్ ఎన్‌సిసికి చెందిన గుడ్‌ల‌క్‌, మాపెల్‌, గగన్‌, నట్వర్‌, ఆలివ‌ర్‌‌ అనే పేర్లు గల అశ్వాలతో విన్యాసాలు చేశారు. ఇందులో ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల ఎన్‌సిసి క్యాడెట్లు మొదటగా జాతీయ జెండా, ఎన్‌సిసి జెండా, టిటిడి జెండాలను ప్రదర్శించారు. అదేవిధంగా, స్టాండిగ్ సెల్యూట్, టెంట్‌ పెగ్గింగ్‌, షో జంపింగ్‌ తదితర విన్యాసాలు చేశారు. క్యాడెట్లు అశ్వాలపై పరేడ్‌ మైదానంలో చుట్టూ తిరుగుతూ చేసిన ఈ విన్యాసాలు అలరించాయి.

తిరుప‌తి 2(ఎ) రెజిమేంట్ క‌మాండింగ్ ఆఫీస‌ర్ క‌ల్న‌ల్ ఆర్‌.టి.ప‌వ‌ర్‌, ఎఎన్‌వో కాప్టెన్ ఎస్‌.అజ్మ‌ల్ భాషా ఆధ్వ‌ర్యంలో ఎన్‌సిసి క్యాడెట్లు ఈ విన్యాసాలు నిర్వ‌హించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.