EQUALITY POSSIBLE ONLY THROUGH SOCIAL CHANGE- BABU JAGJIVAN RAM A GREAT HUMANIST -TTD JEO SMT SADA SHARGAVI _ దృక్పథంలో మార్పుతోనే సామాజిక సమానత్వం సాధ్యం- గొప్ప మానవతావాది డా|| బాబు జగ్జీవన్‌రామ్- టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమ‌తి స‌దా భార్గ‌వి

Tirupati, 05 April 2022: TTD JEO (Education & Health) Smt Sada Bhargavi said on Tuesday advocated that social change can alone uphold human values in society.

 

Participating in the 115th Jayanti fete of Babu Jagjivan Ram as chief guest in Mahati auditorium the JEO said that Dr Babu Jagjivan Ram strived to remove social untouchability and everyone should tread in the path of such great humanitarian leaders.

 

Another prominent speaker of the event Acharya, Ch Srinivas Rao, Dean of Vikramasimhapuri University said as union agriculture minister Babu Jagjivan Ram had infused green revolution and increase agricultural yield. He was also well known for his landmark initiatives for reservations for Dalits he added.

 

Dr BN Ratna founder president of Dalit Adivasu women entrepreneurs of Hyderabad said Babuji also contributed for women empowerment and Dalits social and political upliftment.

 

Earlier the TTD JEO paid floral tributes to Babuji portrait and 20 TTD employees who had rendered meritorious services were presented momentos and gave away prizes to winners of essay writing and quiz contests held as part of Babuji Jayanti celebrations.

 

TTD Estate officer Sri Mallikarjuna, Special Grade DyEO Smt Varalakshmi, DyEOs Sri Subramaniam, Sri Damodaram, Smt Nagaratna, Liaison officer Dr Bharat Kumar and other officers were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దృక్పథంలో మార్పుతోనే సామాజిక సమానత్వం సాధ్యం

– గొప్ప మానవతావాది డా|| బాబు జగ్జీవన్‌రామ్

– టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి, 2022, ఏప్రిల్‌ 05: వివక్షకు సంబంధించి ప్రతి ఒక్కరి ఆలోచనా దృక్పథంలో మార్పుతోనే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని టిటిడి టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమ‌తి స‌దా భార్గ‌వి అన్నారు. జ‌గ్జీవన్‌రామ్ 115వ జయంతి వేడుకలను తిరుపతిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిగా దేశంలో హ‌రిత విప్ల‌వం తీసుకొచ్చి దిగుబ‌డులు పెంచిన ఘ‌నత డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్ కు ద‌క్కుతుంద‌న్నారు. ఆయన అందించిన ఫలాలు నేటికీ దేశప్రజలకు అందుతున్నాయన్నారు. త‌ల్లి బ‌సంతీదేవి ప్రోత్సాహంతో వారి ఇంట్లో భ‌గ‌వ‌ద్గీత‌, రామాయ‌ణ ప‌ఠ‌నం జ‌రిగేద‌ని, తద్వారా హిందూ ధ‌ర్మ ప‌రిరక్ష‌ణ‌కు శ్రీ జ‌గ్జీవ‌న్‌రామ్ పాటుప‌డ్డార‌ని తెలిపారు. చిన్న వయసు నుండే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ  సామాజిక అంత‌రాల‌ను తొల‌గించేందుకు, అంట‌రానిత‌నం నిర్మూల‌న‌కు ఎంత‌గానో కృషి చేశార‌ని, ఆయన గొప్ప మానవతావాది అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి మహనీయుల అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. ప్ర‌తి ఒక్క‌రిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంద‌ని, అని కులం వ‌ల్ల‌, డ‌బ్బు వ‌ల్ల రాద‌ని చెప్పారు. స్వామివారి దృష్టిలో అన్ని వృత్తులు చేసేవాళ్లూ స‌మాన‌మేన‌ని వివ‌రించారు. స‌మాజంలో ఉన్న మాలిన్యాల‌ను తొల‌గించేందుకు ఇలాంటి మ‌హ‌నీయులు ఉద్భ‌విస్తుంటార‌ని చెప్పారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న త‌రువాత మ‌న ఆలోచ‌నా విధానంలో మార్పు రావాల‌న్నారు.

ముఖ్య వ‌క్త‌ల్లో ఒక‌రైన విక్రమసింహపురి వర్సిటీ డీన్ ఆచార్య సిహెచ్.శ్రీనివాసరావు మాట్లాడుతూ బీహార్ లో భూకంపం వచ్చినప్పుడు స్థానిక యువకులను సమీకరించి సహాయ కార్యక్రమాలు నిర్వహించడం ఆయన నాయకత్వ లక్షణానికి నిదర్శనమన్నారు. హిందూ ధార్మిక విలువలున్న కుటుంబంలో జన్మించారని, శ్రీ మదన్ మోహన్ మాలవ్య, శ్రీ సంత్ రవిదాస్ లాంటివారి సాన్నిహిత్యంతో ఎదిగారని వివరించారు. దళితులకు రిజర్వేషన్ల సాధనకు ఎంతగానో కృషి చేశారని చెప్పారు.

మ‌రో ముఖ్య వ‌క్త హైదరాబాదుకు చెందిన దళిత ఆదివాసీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఫౌండర్ ప్రెసిడెంట్ డా.బిఎన్.రత్న ఉప‌న్య‌సిస్తూ బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని, ఇందుకోసం నిరంతరం స్ఫూర్తి పొందాలని కోరారు. డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్ రాజ్యాంగ సభ సభ్యుడిగా దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం గట్టిగా వాదించారని తెలిపారు. ఆయన మహిళల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. మహిళకు నిబంధనలు విధించకుండా స్వేచ్ఛగా ఎదగనిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్నారు.

అంతకుముందు టిటిడి జెఈవో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా విశేష సేవ‌లందించిన 20 మంది ఉద్యోగులకు జ్ఞాపిక‌లు, వ్యాస‌ర‌చ‌న‌, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్టేట్ అధికారి శ్రీ మల్లికార్జున, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, డెప్యూటీ ఈవోలు శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, శ్రీ దామోదరం, శ్రీ‌మ‌తి నాగరత్న, లైజాన్ అధికారి డాక్టర్ భరత్ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.  

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.