MAHA SAMPROKSHANAM RITUALS COMMENCES _ రంపచోడవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం 

TIRUPATI, 18 MAY 2023: The Maha Samprokshanam rituals commenced on a grand religious note in Rampachodavaram in Alluri Seetaramaraju district on Thursday.

Panchagavyaprasana, Vastu-Akalmasha-Prayaschitta Homams, Raksha Bandhanam were conducted between 8am and 11am.

In the evening Agni Pratista, Kumbha Sthapana, Kumbharadhana will be performed.

TTD Annamacharya Project artists performed devotional cultural programs.

DyEOs Sri Gunabhushan Reddy, Sri Siva Prasad, Sri Venkataiah and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

రంపచోడవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

తిరుపతి, 2023 మే 18: అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

ఉదయం 8 నుండి 11 గంటల వరకు పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు అగ్ని ప్రతిష్ట, కుంభ స్థాపన, కుంభారాధన, విశేష హోమాలు నిర్వహిస్తారు.

టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, డిఈ శ్రీ ఆనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.