FLOAT FESTIVAL OF SRI GOVINDARAJA SWAMY _ విద్యుద్దీపకాంతుల్లో శ్రీ గోవిందరాజస్వామివారి విహారం

Tirupati, 24 February 2021: On Day-5 of the ongoing float festival of Sri Govindarajaswami temple, the utsava idols of Sri Govindaraja Swamy and his consorts took a celestial ride on the electrical and flower decorated float in the Govindaraja Swamy Pushkarini on Wednesday evening.

As part of the festival grand snapana thirumanjanam was performed for the utsava idols of Sri Govindaraja Swamy and his consorts Sri Bhudevi and Sridevi in the morning and after the float ride in the evening, they also went round in procession on the Mada streets.

On the fifth day of the celestial festival, the deities went round seven rounds in the Sri Govindaraja Swamy Pushkarini and blessed the devotees.

As part of the festivities the artists of the HDPP and Annamacharya project presented bhajans, harikatha and other sangeet programs.

Special grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravi Kumar Reddy, Superintendents Sri Venkatadri and Sri Rajkumar, Temple inspectors and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

విద్యుద్దీపకాంతుల్లో శ్రీ గోవిందరాజస్వామివారి విహారం

తిరుపతి, 2021 ఫిబ్రవరి 24: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌వారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

తెప్పలను అధిరోహించిన స్వామివారు శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా గురు, శుక్ర‌ వారాల్లో శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, ‌‌శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కామ‌రాజు, శ్రీ మునీంద్ర‌బాబు ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.