SRI RAMA NAVAMI ASTHANAM HELD AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం

Tirumala, 2 April 2020: The prestigious and holy event of Sri Sita Rama Lakshmana Sametha Hanumanta Asthanam was held in Srivari temple on Thursday.

Earlier during the day Snapana Tirumanjanam was held at Ranganayakula Mandapam to the utsava idols of Sri Sitarama Lakshmana Sametha Hanumanta Swamivarlu.

Thereafter the Veda pundits chanted pasuras from Divya Prabandam besides Purusha Suktam, Tetittiriya upanishad, Sri Suktam, BhuSultam, Neela Suktam and Pancha Shanti mantras which were aimed to enhance the divine charm of Srivari temple further.

Sri Sri Sri Pedd Jeeyar Swami and Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala, TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri A V Dharma Reddy, Temple Dyeo Sri Harindranath and other officials participated.

Later in the night Sri Ramanavami Asthanam was performed at the Bangaru vakili inside the Srivari temple.

TTD has however cancelled the Sri Hanumanta vahana seva conducted on the occasion of Sri Ramanavami in view of the Coronavirus restrictions.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల, 2020 ఏప్రిల్ 02: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారంనాడు శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చన ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.  

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.  
 
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీరామనవమి ఆస్థానం
       
అనంతరం రాత్రి 7 నుండి 8 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.
       
కాగా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే హనుమంత వాహన సేవను టిటిడి రద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.